Share News

కార్మిక చట్టాలను మార్చిన బీజేపీని ఓడించాలి

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:34 PM

బీజేపీని ఓడించి ఇండియా కూటమిని గెలిపించా లని ఎల్‌ఐసీ ఐసీఈయూ రాష్ట్ర కార్యదర్శి జి.తిరుపతయ్య పిలుపునిచ్చారు.

కార్మిక చట్టాలను మార్చిన బీజేపీని ఓడించాలి
మాట్లాడుతున్న ఎల్‌ఐసీ ఐసీఈయూ రాష్ట్ర కార్యదర్శి జి.తిరుపతయ్య

- ఎల్‌ఐసీ ఐసీఈయూ రాష్ట్ర కార్యదర్శి జి.తిరుపతయ్య

పాలమూరు, ఏప్రిల్‌ 28 : బీజేపీని ఓడించి ఇండియా కూటమిని గెలిపించా లని ఎల్‌ఐసీ ఐసీఈయూ రాష్ట్ర కార్యదర్శి జి.తిరుపతయ్య పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘పార్లమెంట్‌ ఎన్నికలు-కార్మికవర్గ కర్తవ్యం’అనే అంశంపై జిల్లా సద స్సు నిర్వహించారు. పదేళ్ల మోడీ పాలనలో కార్మికచట్టాలన్ని యాజమాన్యా లకు చుట్టాలుగా మారాయని, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతున్నారన్నారు. తమ హక్కుల రక్షణకు కార్మికరంగం పోరాడే శక్తి లేకుండా నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్న రైతులలో 750మంది చావుకు కారణం ప్రధాని మోదీ అన్నారు. ప్రశ్నించే మేధావులను, కళాకారులను, కవులను ఉపా చట్టం కింద జైలు పాలు చేశారన్నారు. అందుకే బీజేపీ చిత్తుగా ఓడించి, ఇండియా కూటమి కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఐటీ యూ సీనియర్‌ నాయకులు కిల్లె గోపాల్‌, జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూ ర్తిలు ప్రసంగించారు. దేశంలో సంపదనంతా కార్పొరేట్లకు కట్టబెట్టి రూ.150 లక్షల కోట్ల అప్పునకు తెరలేపారని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌ మార్గద ర్శకత్వంలో ప్రభుత్వం నడుస్తోందన్నారు. గాంధీని చంపిన గాడ్సే వారసులుగా బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. వి.కురుమూర్తి, సత్యన్న, వరద గాలెన్న, గొనెల రాములు, రామ్మోహన్‌రావు, కేశవులు, అలివేల, చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:34 PM