Share News

ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం నేర్పాలి

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:39 PM

పదేళ్ల పాలనలో ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధా నాలు అవలంబించిన బీజేపీ దాని మిత్రపక్షాలకు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తగి న గుణపాఠం నేర్పాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం నేర్పాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి

- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి

గద్వాల టౌన్‌, ఏప్రిల్‌ 27 : పదేళ్ల పాలనలో ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధా నాలు అవలంబించిన బీజేపీ దాని మిత్రపక్షాలకు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తగి న గుణపాఠం నేర్పాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి పిలుపునిచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన లౌకిక ప్రజాతంత్ర ఇండియా కూటమికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. శనివారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో సీపీఎం అనుబంధ సంఘాల ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వెంకటస్వామి మాట్లాడుతూ నరేంద్ర మోదీ హయాంలో దేశంలో ఒక కొత్త జాతీయస్థాయి విద్యాసంస్థ ఏర్పా టు జరగలేదన్నారు. ఒక కొత్త పబ్లిక్‌ రంగ సంస్థ ఏర్పాటుతో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రయత్నం జరగలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా మ న్న నాయకులు కొత్త చట్టాలతో రైతులను ముంచే ప్రయత్నం చేసి, రైతు సం ఘాల ప్రతిఘటనతో వెనక్కితగ్గిన విషయాన్ని ప్రజలు గమనంలోకి తీసుకో వాల న్నారు. కార్మిక హక్కులను హరించి శ్రమదోపిడీకి పాల్పడిన పాలకులు తమ అసమర్థ విధానాలతో అన్నివర్గాల వారిని సమస్యల్లోకి నెట్టివేశారని ఆరోపించారు. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జీవితం దుర్భరం కాగా, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్ని స్తున్న బీజేపీ దాని మిత్రపక్షాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. సమావేశంలో సీపీఎం, సీఐటీయూ దాని అనుబంధ సంఘాల నాయకులు వివినరసింహ, ఉప్పేరు నరసింహ, వెంకటేశ్వర్లు, గట్టన్న, రాజేష్‌, రంగన్న, రామకృష్ణ, కల్యాణ్‌, సుధాకర్‌, పరశురాం, జయన్న, బతుకన్న ఉన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:39 PM