Share News

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ పాలన

ABN , Publish Date - Apr 22 , 2024 | 11:30 PM

బీజేపీ పదేళ్ల పాలనలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరి పాలన సాగించిం దని భారత రాజ్యాంగ పరి రక్షణ సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ వన్నాడ అంజన్న ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ పాలన
సమావేశంలో మాట్లాడుతున్న వన్నాడ అంజన్న

- భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ వన్నాడ అంజన్న

- 27న చలో మహబూబ్‌నగర్‌ను జయప్రదం చేయాలి

పాలమూరు, ఏప్రిల్‌ 22 : బీజేపీ పదేళ్ల పాలనలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరి పాలన సాగించిం దని భారత రాజ్యాంగ పరి రక్షణ సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ వన్నాడ అంజన్న ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎఫ్‌ టీయూ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకోవటంతోనే దేశాన్ని కాపాడుకుంటామన్నారు. ఈనెల 27న చలో మహబూబ్‌నగర్‌(జిల్లా కేంద్రంలోని ఎంబీసీ కంపౌండ్‌)లో నిర్వహించనున్న బ హిరంగ సభకు ప్రజలు అధికసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను అణచివేస్తున్న బీజేపీ గుణాన్ని అర్థం చేసుకోవాలన్నారు. మనువాదం వద్దు-మానవీయ సమాజాన్ని నిర్మించుకునేందుకు ప్రజాస్వామిక వాదులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కుల,మతం,రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగాన్ని కాపా డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బహిరంగ సభకు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు అధికసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సభకు ముఖ్య అతిథులుగా యోగేంద్రయాదవ్‌, ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ కాశీం, దాస్‌ రాంనాయక్‌, రెవరెండ్‌ డాక్టర్‌ వీపీ ఆశీర్వాదం, బిషప్‌ డాక్టర్‌ విల్సన్‌సింగం, అమీర్‌అలీఖాన్‌, కాచం సత్యనారాయణ హాజరుకానున్నట్లు వివరించారు. సమావేశంలో ఎస్‌ ఎం ఖలీల్‌, కాశపోగు ప్రసాద్‌, ఇస్లావత్‌ రవినాయక్‌, గట్టన్న, జాకీర్‌హుస్సేన్‌, నిజాముద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 11:30 PM