Share News

దేశానికి బీజేపీ పెద్ద ప్రమాదకారి

ABN , Publish Date - Apr 28 , 2024 | 04:29 AM

భారతదేశానికి బీజేపీ అతి పెద్ద ప్రమాదకారి అని, ఆ పార్టీ కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం

దేశానికి బీజేపీ పెద్ద ప్రమాదకారి

మేడిగడ్డపై కేసీఆర్‌వి తెలివితక్కువ మాటలు

మంద కృష్ణ ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రచారక్‌లా మారాడు: కడియం శ్రీహరి

హనుమకొండ, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): భారతదేశానికి బీజేపీ అతి పెద్ద ప్రమాదకారి అని, ఆ పార్టీ కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. సమాజంలో ప్రణాళికాబద్ధంగా మత విద్వేషాన్ని చొప్పించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలని, దేశా న్ని రక్షించుకోవాలంటే ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లేకుంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హనుమకొండలోని తన నివాసంలో శనివారం కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనలో బీజేపీ దేశంలోని ఏవర్గానికీమేలు చేయకపోగా వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించిందన్నారు. పేదల పొట్టకొట్టి అదానీ, అంబానీల జేబులు నింపిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన ప్రధాని మోదీకి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదని చెప్పారు. విభజన హామీల్లో ఏ ఒక్క దానినీ మోదీ ప్రభు త్వం అమలు చేయలేదని, బీజేపీకి ఓటేస్తే రాబోయే రోజుల్లో ఆ పార్టీ రాష్ట్రానికి చేసేది ఏమీ ఉండదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటుపై మాజీ సీఎం కేసీఆర్‌ తెలివితక్కువగా, ప్రజలను తప్పుదారి పట్టించేలా మా ట్లాడుతున్నారని కడియంశ్రీహరి ఆరోపించారు. కావ్య కులంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ఆమె నామినేషన్‌ సక్రమంగా ఉన్నట్టు ఎన్నికల అధికారి ధ్రువీకరించిన తర్వాత ఇక సమస్య ఏముందని ప్రశ్నించారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రచారక్‌లాగా మాట్లాడుతున్నాడని, ఎన్నికల తర్వాత ఆయన తన దగ్గరికి వచ్చి పొరపాటైందని క్షమాపణ అడుగుతాడు చూడండి అని చెప్పారు.

Updated Date - Apr 28 , 2024 | 10:19 AM