బీజేపీ, బీఆర్‌ఎ్‌సలను ఓడించాలి
ABN , Publish Date - May 12 , 2024 | 12:12 AM
మతోన్మాద బీజేపీని, రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సను ఓడించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎ్‌సలను ఓడించాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
గుర్రంపోడు, మే 11: మతోన్మాద బీజేపీని, రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సను ఓడించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. శనివారం మండల కేం ద్రంలోని చేపూరి నర్సింహాచారి భవనంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి దేశంలో అధికారం చేపడుతుందని నల్లగొండ ఎంపీగా ఇండియా కూటమి అభ్యర్థి రఘువీర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అంజాచారి, మండల కార్యదర్శి రేపాక లక్ష్మిపతి, మాజీ జడ్పీటీసీ బచ్చనబోయిన వెంకటయ్య, మండల కార్యవర్గ సభ్యులు షేక్ మదార్, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.