Share News

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు పేదలకు చేసింది ఏమీ లేదు

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:33 PM

పేదల కోసం పుట్టి, పేదల కోసం పని చేస్తున్న పార్టీ కాంగ్రెస్‌ అని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు పేదలకు చేసింది ఏమీ లేదని పాలమూర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు పేదలకు చేసింది ఏమీ లేదు
హన్వాడ : దాచకపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం

- ఎమ్మెల్యే సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరిక

హన్వాడ, ఏప్రిల్‌ 28 : పేదల కోసం పుట్టి, పేదల కోసం పని చేస్తున్న పార్టీ కాంగ్రెస్‌ అని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు పేదలకు చేసింది ఏమీ లేదని పాలమూర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటమ్మకుంటతండా, దయ్యాలమర్రితండా, దాచకపల్లి, టంకర, గుడిమల్కా పూర్‌, రాంనాయక్‌ తండాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయా గ్రామాలలో ఓటర్లను కలిసి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఆగస్టు వరకు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదని, ఉద్యోగాలు కల్పించలేదని, డబుల్‌ బెడ్రూంలు ఇళ్ల ఇవ్వాలని ఆరోపించారు. ఎంపీగా చల్లా వంశీచందర్‌రెడ్డి గెలిస్తే మహబూ బ్‌నగర్‌ ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దాచకపల్లి మాజీ సర్పంచి బాలకిష్టారెడ్డి, గుడిమల్కాపూర్‌ మాజీ ఉపసర్పంచి వెంకట్‌రెడ్డి, మాజీ ప్రజాప్ర తినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకుడు సురేందర్‌రెడ్డి, ఎన్‌పీ వెంకటేష్‌, మండల అధ్యక్షుడు మహేందర్‌, యాదయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన 22వ వార్డు కౌన్సిలర్‌ రశ్మిత

మహబూబ్‌నగర్‌ : బీఆర్‌ఎస్‌ నుంచి మరో కౌన్సిలర్‌ చేజారిపోయారు. పాలమూరు పురపాలిక పరిధిలోని భగీరథకాలనీ 22వ వార్డుకు చెందిన రశ్మిత ప్రశాంత్‌ బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి ఆదివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ నుంచి గెలుపొందిన ఈమె ఆ తరువాత బీఆర్‌ఎస్‌లో చేరారు. చివరకు కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఆ తరువాత మరో కౌన్సిరల్‌ కిశోర్‌ బీజేపీలో చేరగా తాజాగా రశ్మిత కాంగ్రెస్‌లో చేరగడంతో బీఆర్‌ ఎస్‌లో ప్రస్తుతం 12మంది కౌన్సిలర్లు మిగిలారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యెన్నం రఽశీనివాస్‌ రెడ్డి సమక్షంలో కౌన్సిలర్‌ రశ్మితతో పాటు మాజీ కౌన్సిలర్‌ సుస్మితాశ్రీనివాస్‌, 33, 3, 46వ వార్డుకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఇక కనుమరుగు కానున్నద ని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వినోద్‌కుమార్‌, నూతి శ్రీకాంత్‌, ఎన్‌పి వెంకటేశ్‌, సిరాజ్‌ఖాద్రి, సీజె బెనహర్‌, లక్ష్మణ్‌యాదవ్‌, మధు పాల్గొన్నారు.

ఫ ఎన్‌టీఆర్‌ రూ.100 కరెన్సీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే : నందమూరి తారకరామారావు రూ.100 కరెన్సీని ఆదివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తుల్లో దివంగత ఎన్టీఆర్‌ ప్రముఖంగా ఉంటారన్నారు. ఆయన స్మారకార్ధం శత జయంతి సందర్బంగా ఆర్బీఐ వంద రూపాయల కరెన్సీని ముద్రించగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, టీడీపీ నాయకులు చంద్రశేఖర్‌ రెడ్డి, వెంకటయ్య, మురళి, యాదయ్య, కేశవులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 11:33 PM