Kumaram Bheem Asifabad- ఎమ్మెల్యే కోవ లక్ష్మి జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2024-02-06T21:26:18+05:30 IST

రెబ్బెన మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేచేత కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు.

Kumaram Bheem Asifabad-    ఎమ్మెల్యే కోవ లక్ష్మి జన్మదిన వేడుకలు
రెబ్బెనలో ఎమ్మెల్యేకు కేక్‌ తినిపిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

రెబ్బెన, ఫిబ్రవరి 6: రెబ్బెన మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేచేత కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు సంతోష్‌, ఎంపీపీ సౌందర్య, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ సంజీవ్‌కుమార్‌, ఎంపీటీసీలు మధునయ్య, శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌లు సోమశేఖర్‌, అహల్యదేవి, సుమలత, వినోద, నాయకులు శంకరమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌ రూరల్‌: ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, నాయకులు వెంకన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు): మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ తోడసం భాగ్యలక్ష్మి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తోడసం ధర్మరావు, మాజీ సర్పంచు ఆర్క నాగోరావు, ఆత్రం ఓంప్రకాష్‌, నాయకులు హామీద్‌ఖాన్‌, మడావి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌: మండలంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మండల కేంద్రంలో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు చిర్లే లక్ష్మణ్‌ , జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఇంతీయాజ్‌లాల, ఉపాధ్యక్షుడు ఆత్రం శంకర్‌, నాయకులు మేస్రాం అంబాజీ, దయాకర్‌, ఆత్రం భీరావ్‌, ఉయిక హన్ను, ఉప సర్పంచ్‌ కుంర జంగు పటేల్‌, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కుంర భగవంత్‌రావ్‌, గుగ్గె నాగనాథ్‌, నౌమాన్‌, జాకీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2024-02-06T21:26:19+05:30 IST