Share News

బిల్డాక్స్‌ సంస్థకు రూ. 3.96 కోట్ల జరిమానా

ABN , Publish Date - Apr 05 , 2024 | 05:35 AM

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బిల్డాక్స్‌ సంస్థకు రెరా రూ.3.96 కోట్ల అపరాధ రుసుం విధించింది. ఫేస్‌బుక్‌ ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తూ కొనుగోలుదారుల నుంచి నగదు

బిల్డాక్స్‌ సంస్థకు రూ. 3.96 కోట్ల జరిమానా

ఫేస్‌బుక్‌ ద్వారా తప్పుడు సమాచారం చేరవేస్తున్నందుకు రెరా ఫైన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బిల్డాక్స్‌ సంస్థకు రెరా రూ.3.96 కోట్ల అపరాధ రుసుం విధించింది. ఫేస్‌బుక్‌ ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తూ కొనుగోలుదారుల నుంచి నగదు వసూళ్లకు పాల్పడుతున్నట్లు గ్రహించి ఈ అపరాధ రుసుం విధించినట్లు రెరా చైర్మన్‌ ఎన్‌. సత్యనారాయణ తెలిపారు. బిల్డాక్స్‌ ప్రాజెక్టు విషయంలో రెరా ట్రిబ్యునల్‌ గురువారం విచారణ చేపట్టింది. బిల్డాక్స్‌ తరఫు న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేయడానికి 3 వారాల సమయం కావాలని కోరినప్పటికి సామాజిక మాధ్యమాల్లో బిల్డాక్స్‌ ప్రకటన కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణించి, కొనుగోలుదారులు మోసాల బారిన పడకుండా వారిని అప్రమత్తం చేసేలా ఈ అపరాధ రుసుం విధించినట్లు రెరా తెలిపింది.

Updated Date - Apr 05 , 2024 | 05:35 AM