Share News

రెండోరోజూ బిహార్‌ ఎమ్మెల్యేల క్యాంపు

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:17 AM

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కాగజ్‌గట్‌ సిరినేచర్స్‌ వ్యాలీ రిసార్టులో.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల క్యాంపు రెండురోజూ కొనసాగింది. స్థానిక ఎమ్మెల్యే

రెండోరోజూ బిహార్‌ ఎమ్మెల్యేల క్యాంపు

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కాగజ్‌గట్‌ సిరినేచర్స్‌ వ్యాలీ రిసార్టులో.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల క్యాంపు రెండురోజూ కొనసాగింది. స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటున్నారు. రిసార్టు పరిసరాలకు ఇతరులెవరూ రాకుంట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 12న బిహార్‌ అసెంబ్లీలో అక్కడి సీఎం నితీశ్‌ విశ్వాసపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో 11వ తేదీ వరకు ఈ క్యాంపు కొనసాగనున్నట్లు తెలిసింది.

Updated Date - Feb 06 , 2024 | 04:17 AM