ట్రెక్కింగ్‌కు కేరాఫ్ భువనగిరి ఖిల్లా
ABN , Publish Date - Nov 27 , 2024 | 12:52 AM
యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలోని భువనగిరి ఖిల్లా ట్రెక్కింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. సముద్ర మట్టానికి సుమారు 502 మీటర్లు(1506 అడుగులు) ఎత్తుతో చారిత్రక సంపదకు, పలు రాజ వంశాల పాలనకు సాక్ష్యంగా ఉన్న ఏకశిలా పర్వతం భువనగిరి ఖిల్లా ఇప్పుడు సాహస క్రీడలకు నెలవుగా ఉంది.
ఇక్కడి నుంచే పర్వతారోహకులకు ప్రాథమిక శిక్షణ
యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలోని భువనగిరి ఖిల్లా ట్రెక్కింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. సముద్ర మట్టానికి సుమారు 502 మీటర్లు(1506 అడుగులు) ఎత్తుతో చారిత్రక సంపదకు, పలు రాజ వంశాల పాలనకు సాక్ష్యంగా ఉన్న ఏకశిలా పర్వతం భువనగిరి ఖిల్లా ఇప్పుడు సాహస క్రీడలకు నెలవుగా ఉంది. పర్వతా రోహకులకు ప్రాథమిక శిక్షణ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడ శిక్షణ పొం దిన వారిలో 98 మంది ఎవరెస్ట్ శిఖ రాన్ని. మరో 800 మంది ప్రపం చంలోని ఎత్తైన పర్వతాలు అధిరో హించిన ఘనత సాధించారు.
(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన్)
భువనగిరి ఖిల్లాపై పర్వతారోహణలో శిక్షణ పొందిన ఔత్సాహి కులు పలురికార్డులు సృష్టించారు. 14ఏళ్ల వయస్సులో ఎవరె్‌స్టను అధిరోహి ంచిన అతిచిన్న పర్వతారోహకురాలిగా పూర్ణ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే ఎత్తైన ఏడు పర్వతాల్లో నాలుగింటిని అధిరోహించి మరో మూడు పర్వతాల లక్ష్య సాధనలో పడమటి అన్విత ఉంది. సుమారు 50వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భువనగిరి ఖిల్లాపైనే పర్వ తారోహణలో శిక్షణ పొందడం కూడా రికార్డుగా పేర్కొంటారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎ్‌ఫఎస్ అధికారులు ఖిల్లాను సందర్శించి పర్వతారోహణలో ప్రాథమిక శిక్షణ పొందుతుంటారు. పలువురు సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారులు, విదేశీ పర్వతారోహకులు ఖిల్లాను తరుచూ సందర్శిస్తుంటారు.
బుకింగ్ ఇలా..
తెలంగాణ పర్యాటక శాఖ, ట్రాన్సెండ్ అడ్వెంచరీస్ ఆఫ్ రాక్ క్లైంబింగ్ సంయుక్తం గా ఖిల్లాపై ట్రెక్కింగ్‌కు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇందుకు కేటగిరీలు, ప్యాకేజీల వారిగా ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఖిల్లా దిగువ భాగంలో ఉన్న రాక్ క్లైంబింగ్ కార్యాలయానికి వచ్చినా అక్కడే స్లాట్ బుక్ చేసి ట్రెక్కింగ్‌కు అనుమతి ఇస్తారు. అదనపు ఆకర్షణగా ఖిల్లా దిగువ భాగంలో రాత్రి బస చేసేందుకు ప్రత్యేక గుడారాలు అందుబాటులో ఉంటాయి. వీటిని కూడా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉం టుంది. ఆంధ్రప్రదేశ్ గండికోట, వరంగల్‌లో ట్రెక్కింగ్ కోసం కూడా ఇదే వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది.
శిక్షణకు మేలైన పర్వతంగా..
పర్వతారోహణకు మేలైన పర్వతంగా భువనగిరి ఖిల్లా ఉంది. ఈ ఖిల్లాపై పర్వతారోహణ శిక్షణ కోసం ఎవరెస్టర్ బీ శేఖర్‌బాబు నెలకొల్పిన భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్‌ను 2013 సెప్టెంబరులో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి చందనాఖాన్ ప్రారంభించారు. ఆ తర్వాత ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్‌గా రూపాంతరం చెందింది. శిక్షణ పొందిన వారు ఎవరెస్టు, కిలిమంజారో, ఎలబ్రూస్, తదితర పర్వతాలను అధిరోహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 50వేల మంది విద్యార్థులు ఈ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. సెలవు రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులు ఖిల్లాపై రాక్ క్లైంబింగ్, రాప్లింగ్ చేస్తుంటారు. అమెరికా, రష్యా, లండన్, కెనడా తదితర దేశాలకు చెందిన పలువురు పర్వతారోహకులు ప్రతి ఏడాది భువనగిరి ఖిల్లాకు వచ్చి తమ నైపుణ్యాన్ని మెరుగు పర్చుకుంటుంటారు.
శిక్షణ ఇలా..
ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్ ఆఽధ్వర్యంలో ఎవరెస్టర్స్ పడమటి అన్విత, పూర్ణ, ఆనంద్, రాఖేష్ పర్యవేక్షణలో శిక్షణ కొనసాగుతోంది. ఔత్సాహికులకు ప్రొఫెషనల్ కోర్సులు, ఇతరులకు ప్రాథమిక శిక్షణ, ఒకరోజు రాక్ క్లైంబింగ్, రాప్లింగ్ విధానంలో శిక్షణ ఇస్తారు. ప్రొఫెషనల్స్‌కు ఏడాది పాటు దఫాల వారిగా, విద్యార్థులు, ఇతరులకు ఒకటి నుంచి ఐదు రోజులు కేటగిరీల వారిగా శిక్షణ ఉంటుంది. ఎవరెస్ట్ తదితర పర్వతాలను అధిరోహించాలనుకునే ఔత్సాహికులకు ఎవరెస్టర్ శేఖర్‌బాబు పర్యవేక్షణలో దేశంలోని పలు పర్వతాలపై కూడా శిక్షణ ఇస్తారు. ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్‌రాక్ క్లైంబింగ్‌లో శిక్షణ పొందిన వారికి ఇచ్చే సర్టిఫికెట్లతో కోచ్‌లుగా ఉపాధి పొ ందవచ్చు. ఇప్పటి వరకు పలువురికి ఉద్యోగాలు కూడా లభించాయి.
ఇక్కడి శిక్షణతోనే ప్రపంచ రికార్డులు సృష్టించా
భువనగిరి ఖిల్లాపై పర్వతారోహణపై ప్రాథమిక శిక్షణ పొందిన నేను ప్రపంచ రికార్డును తిరగరాశాను. 14 సంవత్సరాల వయస్సులో ఎస్టీ హాస్టల్ విద్యార్థినిగా మరో పర్వతారోహకుడు ఆనంద్‌తో కలిసి 2014లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాను. దీంతో అతిపిన్న ఎవరెస్టర్‌గా రికార్డు నా సొంతమైంది. ఇప్పటి వరకు ఆ రికార్డు నాపేరిటే ఉన్నది.
పూర్ణ, పర్వతారోహకురాలు.
నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఖిల్లా
నేను డిగ్రీ చదువకునే వరకు ఓ సాధారణ విద్యార్థి నిని. కానీ విద్యార్థి దశలోనే భువనగిరి ఖిల్లాపై సాగుతున్న శిక్షణతో ఆసక్తి పెంచుకొని ఎంబీఏలో చేరాక పూర్తిస్థాయి పర్వతారోహణ శిక్షణను భువ నగిరి ఖిల్లాపై పూర్తి చేసి ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని మరో 3 ఎత్తైన పర్వతాలను అధిరోహించడంతో నేను ప్రపంచానికి పరిచయమయ్యా.
పడమటి అన్విత, ఎవరెస్టర్.
ట్రెక్కింగ్‌కు అత్యుత్తమం
భువనగికి ఖిల్లా ట్రెక్కింగ్‌కు అత్యుత్తమంగా ఉంటుంది. నేను పలు సార్లు భువనగిరి ఖిల్లాపై పర్వతారోహణ చేశాను. ఇక్కడ ప్రాథమిక శిక్షణ పొందిన వారు పర్వతారోహణలో మెలకువలను తెలుసుకోవచ్చు. భువనగిరి ఖిల్లా స్వరూపం ట్రెక్కింగ్‌కు, సాహస క్రీడలకు అనువుగా ఉంటుంది.
తరుణ్ జోషి, ఐపీఎస్ అధికారి.
ఎవరెస్టర్స్ కేరాఫ్ భువనగిరి ఖిల్లా
భువనగిరి ఖిల్లా కేరాఫ్ ఎవరెస్టర్స్‌గా ప్రసిద్ధి. పర్వతారోహణలో ఖిల్లాపై శిక్షణ పొందిన వారిలో 98 మంది ఎవరెస్ట్ పర్వతాన్ని, మరో 800 మంది కిలిమంజారో తదితర ఎత్తైన పర్వతాలను అధిరోహించారు. అలాగే ట్రెక్కింగ్‌ను ఇష్టపడే ఔత్సాహికులకు కూడా భువనగికి ఖిల్లాకు ప్రాధాన్యమిస్తూ నిత్యం సందర్శిస్తున్నారు.
బీ శేఖర్‌బాబు, ఎవరెస్టర్, ఎండీ, ట్రాన్సెండ్ అడ్వెంచర్స్