Share News

‘భాష్యం’ విద్యార్థుల ప్రభంజనం

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:05 AM

జేఈఈ మెయిన్‌-2024 ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపారని విద్యాసంస్థల చైర్మన్‌ రామకృష్ణ వెల్లడించారు. భాష్యం విద్యార్థి ఎం.జిష్ణుసాయి ఆలిండియా టాప్‌

‘భాష్యం’ విద్యార్థుల  ప్రభంజనం

గుంటూరు(విద్య): జేఈఈ మెయిన్‌-2024 ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపారని విద్యాసంస్థల చైర్మన్‌ రామకృష్ణ వెల్లడించారు. భాష్యం విద్యార్థి ఎం.జిష్ణుసాయి ఆలిండియా టాప్‌ మార్కు 300కి 300 మార్కులు సాధించి 100పర్సంటైల్‌తో ఓపెన్‌ కేటగిరీలో ఆలిండియా 18వ ర్యాంకును సాధించారన్నారు. ఎం.సాయియశ్వంత్‌రెడ్డి 100 పర్సంటైల్‌తో ఓపెన్‌ కేట్ఠగిరీలో ఆలిండియా 36వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో ఆలిండియా 4వ ర్యాంకు కైవసం చేసుకున్నారని తెలిపారు. ఇంకా ఆలిండియా స్థాయి లో డి.భరత్‌చంద్ర 20వ ర్యాంకు, కె.జె.వివేక్‌ 33, జి.జాన్‌ 49, కె.హర్షిత 50, పి.శ్యామ్‌ 62, జె.మణిప్రదీప్‌ 69, కె.చైతన్య 77, ఎ.గణేషదత్తా 78, కె.శ్రేయ 82 ర్యాంకులు సాధించారని చెప్పారు. అలాగే 100 లోపు అత్యుత్తమ ర్యాంకులతో పాటు జాతీయ స్థాయిలో 200 లోపు 25 ర్యాంకులు, 500 లోపు 54 ర్యాంకులు, 1000 లోపు 78 ర్యాంకులు కైౖవసం చేసుకొని 71.68 శాతం ఫలితాలతో భాష్యం విద్యార్థులు సత్తా చాటారని రామకృష్ణ స్పష్టం చేశారు. ర్యాంకర్లను భాష్యం విద్యాసంస్థల డైరెక్టర్‌ హనుమంతరావు, భాష్యం ఐఐటి జేఈఈ కోఆర్డినేటర్‌ ఆనంద్‌ అభినందించారు.

Updated Date - Apr 26 , 2024 | 05:05 AM