Share News

భాగ్యరెడ్డి వర్మ సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - May 22 , 2024 | 11:12 PM

దళిత వైతాళికులు, సంఘ సంస్కర్త ఎం.వి.భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆదర్శమైన జీవితాన్ని కలెక్టర్‌ జి. రవినాయక్‌ కొనియాడారు.

భాగ్యరెడ్డి వర్మ సేవలు చిరస్మరణీయం
ఎం.వి. భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పిస్తున్న కలెక్టర్‌ జి.రవి నాయక్‌

- సంఘ సంస్కర్తకు ఘన నివాళి అర్పించిన కలెక్టర్‌ రవి నాయక్‌

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), మే 22 : దళిత వైతాళికులు, సంఘ సంస్కర్త ఎం.వి.భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆదర్శమైన జీవితాన్ని కలెక్టర్‌ జి. రవినాయక్‌ కొనియాడారు. షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలోని ఎన్‌ఐసీ కాన్ఫరెన్స్‌ హాలులో సంఘసంస్కర్త ఎం.వి.భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ జి. రవినాయక్‌ ఎం.వి. భాగ్యరెడ్డి వర్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎం.వి.భాగ్యరెడ్డి వర్మ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.వి.వి. రవికుమార్‌, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి పాండు, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంఘ సంస్కరణకు కృషి

పాలమూరు : హైదరాబాద్‌ సంస్థానంలో సంఘ సంస్కరణకు కృషి చేసిన మహోన్నతుడు మాదరి భాగ్యరెడ్డి వర్మ అని జాతీయ మాలల ఐక్యవేదిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూమర్ల నిరంజన్‌, జిల్లా అధ్యక్షుడు బండి రమాకాంత్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ సంస్థానంలో 26దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి పునాదులు వేశారని గుర్తు చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థలపై ఆవిశ్రాంత పోరాటం చేసి వాటి రద్దుకు నిజాం నవాబులను ఒప్పించిన ఘనత భాగ్యరెడ్డివర్మదన్నారు. కార్యక్ర మంలో ఉద్యోగుల సంఘం నాయకులు కృష్ణయ్య, మనోహర్‌, నీరటి నరసింహులు, గోపాల్‌ పాల్గొన్నారు.

ఫ విద్యుత్‌ సంస్థలో : మాదరి భాగ్యరెడ్డివర్మ జయంతిని విద్యుత్‌ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎస్‌.ఈ. పి.వెంకటరమేష్‌, డీఈటీ చంద్రమౌళి తదితరులు భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎస్‌ఏవో బీచుపల్లి, ఏవో గోపీకృష్ణ, ఏఏవో గంగాధర్‌, అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మిడ్జిల్‌లో ..

మిడ్జిల్‌ : దేశంలోని గొప్ప సంఘసంస్కర్త భాగ్యరెడ్డివర్మఅని డాక్టర్‌ శివకాంత్‌ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో భాగ్యరెడ్డివర్మ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి సిబ్బందితో కలిసి శివకాంత్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శివకుమార్‌, దేవయ్య, జంగయ్య, సంపత్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - May 22 , 2024 | 11:12 PM