Share News

‘భగీరథ’ నీటిలో పక్షుల అవయవాలు

ABN , Publish Date - May 27 , 2024 | 10:34 PM

మిషన్‌ భగీరథ తాగునీటి పైపులైన్‌లో పక్షుల అవయవాలు కలకలం రేపాయి. ఈ ఘటన నవాబుపేట మండలంలోని పులుమామిడి గ్రామంలో సోమవారం జరిగింది.

‘భగీరథ’ నీటిలో పక్షుల అవయవాలు

నవాబుపేట, మే 27: మిషన్‌ భగీరథ తాగునీటి పైపులైన్‌లో పక్షుల అవయవాలు కలకలం రేపాయి. ఈ ఘటన నవాబుపేట మండలంలోని పులుమామిడి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అంజయ్యను గత వారం రోజులుగా పైపుల నుంచి నీరు రావడం లేదని తెలపగా సోమవారం పైపులైన్‌ను తవ్వగా అందులో నుంచి పావురాలు, కాకుల ఎముకలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఈ విషయంపై ఇన్‌చార్జి ఎంపీడీవో అజయ్‌కుమార్‌ను వివరణ కోరగా మిషన్‌ భగీరథ ట్యాంకులో పక్షులు పడి మృత్యువాతపడి ఇలా పైప్‌లైన్‌లోకి వచ్చి ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని భగీరథ ఏఈ అనంతరెడ్డి, , పంచాయతీ కార్యదర్శి భానుప్రసాద్‌లను ఆదేశించారు.

Updated Date - May 27 , 2024 | 10:34 PM