Share News

40% ఫిట్‌మెంట్‌తో మెరుగైన పీఆర్సీ ఇవ్వాలి

ABN , Publish Date - May 03 , 2024 | 04:38 AM

పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40శాతం ఫిట్‌మెంట్‌ తో మెరుగైన పీఆర్సీ అమలు చేయాలని వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) చైర్మన్‌ శివశంకర్‌ను ట్రెసా ప్రతినిధి బృం దం కోరింది.

40% ఫిట్‌మెంట్‌తో మెరుగైన పీఆర్సీ ఇవ్వాలి

పీఆర్సీ చైర్మన్‌కు ట్రెసా విజ్ఞప్తి

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40శాతం ఫిట్‌మెంట్‌ తో మెరుగైన పీఆర్సీ అమలు చేయాలని వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) చైర్మన్‌ శివశంకర్‌ను ట్రెసా ప్రతినిధి బృం దం కోరింది. గురువారం బీఆర్‌కే భవన్‌లో పీఆర్సీ కమిటీతో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) అధ్యక్షుడు వంగ రవీందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌ ఇతర ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలోని ఉద్యోగుల సమస్యలను ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ‘గ్రూప్‌-2 ద్వారా ఎగ్జిక్యూటివ్‌ పోస్టులో ఎంపికైన డిప్యూటీ తహసీల్దార్‌తో పోలిస్తే నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టులో ఎంపికైన ఏఎ్‌సఓలకు పదోన్నతిలో తేడాలున్నాయి. వీటిపై అధ్యయనం చేసి సవరించాలి’ అని విజ్ఞప్తి చేశారు. వీటిపై పీఆర్సీ చైర్మన్‌ సానుకూలంగా స్పందించారని.. ప్రభుత్వానికి సిఫార్సు చేసి పరిష్కరిస్తామని హామీనిచ్చారని ట్రెసా ప్రతినిధులు వెల్లడించారు.

Updated Date - May 03 , 2024 | 08:38 AM