Share News

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:07 PM

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన, గుణాత్మకమైన విద్య అందుతుందని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య

- బడి బాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు

భూత్పూర్‌, జూన్‌ 9 : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన, గుణాత్మకమైన విద్య అందుతుందని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అన్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని మద్దిగట్ల, కప్పెట, పాత మొల్గర, కొత్తమొల్గర, పోతులమడుగు, వెల్కిచర్ల తదితర గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ మీ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని, మీ పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఆయా గ్రామాల ఉపాధ్యాయులు గ్రామాల్లో తల్లిదండ్రులను సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా మానిటరింగ్‌ (ఏఎంవో) దుంకుడు శ్రీనివాసులు మండల కేంద్రంలో ఉన్న ఎంఈవో కార్యాలయంలో మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయు లకు యూనిఫాం దుస్తులు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఉపాధ్యాయులతో ఆయన బడిబాట కార్యక్రమంలో ఎంత మంది విద్యార్థులు బడిలో చేరుతున్నారని, అదేవిధంగా గ్రామాల్లో పిల్లల తల్లి దండ్రులకు విద్యపట్ల ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో నాగయ్య, సీఆర్పీ విక్రమ్‌ం, ఆయా గ్రామాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సర్కారు బడిలోనే మెరుగైన వసతులు

కోయిలకొండ : సర్కారులు బడుల్లోనే మెరుగైన వసుతులు కల్పించి నాణ్యమైన విద్యను అందుతుందని గార్లపాడ్‌ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం స్వర్ణలత తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం గార్లపాడ్‌లో ప్రచారం చేశారు. పాఠశాలలు ప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు అందించనున్నట్లు తెలిపారు.

Updated Date - Jun 09 , 2024 | 11:07 PM