హిందూయిజం పేరుతో హిందువులకే ద్రోహం
ABN , Publish Date - May 07 , 2024 | 05:28 AM
నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీకి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.
పార్లమెంటు ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలి
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్ర కుమార్
బర్కత్‌పుర, మే 6 (ఆంధ్రజ్యోతి): నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీకి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్ర కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీని, బీఆర్‌ఎ్‌సను ఓడించి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఆయన కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి ఆధ్వర్యంలో లోక్‌సభ ఎన్నికలు 2024- రాజ్యాంగ పరిరక్షణ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. హిందూయిజం పేరుతో హిందువులకే బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని విమర్శించారు. ప్రొఫెసర్ పీ.ఎల్. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, బీజేపీని ఓడిస్తేనే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. దేశానికి మోదీ చేసిందేమీ లేదని, మరోసారి ఆయన అధికారంలోకి వస్తే అన్ని వ్యవస్థలు సర్వనాశనం ఆవుతాయని అన్నారు.