Share News

‘పది’లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి

ABN , Publish Date - Jan 04 , 2024 | 11:20 PM

ఎస్‌ఎస్‌సీ వార్షిక పరీక్ష లలో అత్యుత్తమ ఫలి తాలు సాఽధించాలని, జీపీఏ10 సాధించాలని విద్యార్థులకు జిల్లా వి ద్యాశాఖ అధికారి రవీం దర్‌ సూచించారు.

‘పది’లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి
స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో

- జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌

జడ్చర్ల, జనవరి 4 : ఎస్‌ఎస్‌సీ వార్షిక పరీక్ష లలో అత్యుత్తమ ఫలి తాలు సాఽధించాలని, జీపీఏ10 సాధించాలని విద్యార్థులకు జిల్లా వి ద్యాశాఖ అధికారి రవీం దర్‌ సూచించారు. జడ్చ ర్ల మునిసి పాలిటీలోని బాదేపల్లి బాలుర జడ్పీహెచ్‌ఎస్‌ను గురు వారం ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో మాట్లాడారు. సిలబస్‌ పూర్తి అయ్యిందా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదివి జీపీఏ 10 సాధించాలని సూచించారు. అంతకుముందు స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ సోపానాల వారీగా టీఎల్‌ఎంను ప్రతినిత్యం వినియోగించాలని, విద్యార్థులకు బోధించాలని సూచించా రు. కార్యక్రమంలో మండల నోడల్‌ అధికారి జగదీశ్‌కుమార్‌, సీపీడీ మురళీధర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ, శ్రీనివాసులు, అనంతప్ప పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2024 | 11:20 PM