Share News

Kumaram Bheem Asifabad- సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 03 , 2024 | 10:38 PM

సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. సైబర్‌ నేరాల కట్టడికి జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్‌లో సైబర్‌ నేరాల పట్ల ప్రత్యేక శిక్షణ పొందిన వారియర్స్‌కు బుధవారం ఎస్పీ సురేష్‌కుమార్‌ ఫోన్లు, సిమ్‌కార్డులు అందజేశారు

Kumaram Bheem Asifabad-    సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ఫోన్లు, స్లిమ్‌ కార్డులు అందజేస్తున్న ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 3: సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. సైబర్‌ నేరాల కట్టడికి జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్‌లో సైబర్‌ నేరాల పట్ల ప్రత్యేక శిక్షణ పొందిన వారియర్స్‌కు బుధవారం ఎస్పీ సురేష్‌కుమార్‌ ఫోన్లు, సిమ్‌కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పోలీసు స్టేషన్‌లో ఒక్కో సైబర్‌ వారియర్‌ చొప్పున 17 మందిని నియమించామని చెప్పారు. సైబర్‌ వారియర్స్‌కు ప్రత్యేకంగా ఫోన్‌ నెంబరు ఉంటుందన్నారు. సైబర్‌ నేరాల బారిన పడితే 930కు కాల్‌ చేయాలని సూచించారు. ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ప్రభాకర్‌రావు, సైబర్‌ క్రైం డీఎస్పీ రమేశ్‌, సీఐ రాణా ప్రతాప్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 10:38 PM