Share News

డెంగీపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 16 , 2024 | 11:07 PM

ప్రజలు డెంగీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని నవాబ్‌పేట మండల వైద్యాధికారి డాక్టర్‌ నరేష్‌ చంద్ర అన్నారు.

డెంగీపై అప్రమత్తంగా ఉండాలి
గండీడ్‌లోఅవగాహన ర్యాలీ చేపట్టిన వైద్య సిబ్బంది

- డాక్టర్‌ నరేష్‌ చంద్ర

నవాబ్‌పేట/ గండీడ్‌/ హన్వాడ/ మిడ్జిల్‌, మే 16 : ప్రజలు డెంగీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని నవాబ్‌పేట మండల వైద్యాధికారి డాక్టర్‌ నరేష్‌ చంద్ర అన్నారు. గురువారం మండల కేంద్రంలో జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వ హించారు. గండీడ్‌, హన్వాడ, మిడ్జిల్‌ మండల కేంద్రాల్లో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వ హించారు. మిడ్జిల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి డెంగీ నివారణపై అవగాహన సదస్సు, అనంతరం ర్యాలీ నిర్వహించారు. ప్రజలు వర్షాకాలంలో డెంగీ వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకో వడంతో పాటు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గండీడ్‌ వైద్యాధికారి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించాలని అన్నారు. కార్యక్రమంలో రాములు, బాలమ్మ, శరభలింగం, శ్రీనివాస్‌, అవినాష్‌, రజిత, రాఘవేందర్‌, వినోద్‌, వాహబ్‌, పుష్ఫ, ఇందిర, రాములమ్మ, శకుంతల, సువార్తమ్మ, వివిధ గ్రామాల ఆశ కర్యకర్తలు, గండీడ్‌లో సీహెచ్‌వో రాములు, సూపర్‌ వైజర్‌లు శాంతమ్మ, అంబదాస్‌ వైద్య సిబ్బంది గోపాల్‌, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, 108 సిబ్బంది అక్బర్‌, హన్వాడలో వైద్యులు ప్రగతి, చతుర్వువేది, సిబ్బంది చంద్రశేఖర్‌, శ్రీనివాసులు, ఆశ వర్కర్లు, మిడ్జిల్‌లో డాక్టర్‌ శివకాంత్‌, సీహెచ్‌వో రాము, సూపర్‌వైజర్‌ మరియమ్మ ఉన్నారు.

Updated Date - May 16 , 2024 | 11:07 PM