బీసీలు రాజ్యాధికారం దిశగా ఐక్యంగా సాగాలి
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:22 PM
బీసీలు రాజ్యాధికారం దిశగా ఐక్యంగా సాగా లని బీసీ మండల కమిటీ కన్వీనర్ ఊర్కొండ రఘుబాబు కోరారు.

బిజినేపల్లి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : బీసీలు రాజ్యాధికారం దిశగా ఐక్యంగా సాగా లని బీసీ మండల కమిటీ కన్వీనర్ ఊర్కొండ రఘుబాబు కోరారు. మండలంలోని నంది వడ్డెమాన్‌లో ఆదివారం జ్యోతిరావు ఫూలే విగ్రహావిష్కరణ కమిటీ ఆధ్వర్యంలో నూతన గ్రామ బీసీ కమిటీని ఎన్నుకొని మాట్లాడారు. 50 శాతానికి పైగా బీసీ జనాభా ఉన్నా చట్టస భల్లో, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం మాత్రం తక్కువ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జ నవరి 3న సావిత్రిబాయి ఫూలే జయంతి వే డుకలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వ హించాలని తెలిపారు. నంది వడ్డెమాన్ బీసీ కమిటీ అధ్యక్షుడిగా కడారి వెంకటయ్య, ప్రధా న కార్యదర్శిగా అస్కని రమేష్, కోశాధి కారి వంగ దామోదర్‌గౌడ్, ఉపాధ్యక్షులుగా ఉప్పు గంటి యాదయ్య, దాసరాజు శ్రీరాములు, వట్టిపల్లి నరసింహ, కాశీం, కార్యదర్శులు చెన్న య్య, చిన్నయ్య, దస్తగిరి, రాజు, గౌరవ సలహా దారులు కురుమయ్య, ప్రభాకరాచారి, చిన్న కురుమయ్య, సోషల్ మీడియా లక్కీశ్వీర్ మల్లే ష్‌లను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో మండల బీసీ నాయకులు రాజేందర్ గౌడ్, వెంకటస్వామి తదితరులు ఉన్నారు.