రాహుల్ బీసీ పక్షపాతిగా నిలిచిపోతారు:జాజుల
ABN , Publish Date - Apr 26 , 2024 | 05:16 AM
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీసీల పక్షపాతిగా నిలిచిపోతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలోని 70 కోట్ల మంది ఓబీసీల ఆకాంక్ష అయిన సమగ్ర
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీసీల పక్షపాతిగా నిలిచిపోతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలోని 70 కోట్ల మంది ఓబీసీల ఆకాంక్ష అయిన సమగ్ర కులగణనను రాహుల్‌గాంధీ తన భుజానికెత్తుకున్నారని, ఇది హర్షించ దగ్గ పరిణామమని ఆయన అన్నారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ మేనిఫెస్టో ఎందుకూ పనికిరాదంటూ విమర్శించడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను విమర్శించడమంటే బీసీలను అవమానించడమే అవుతుందని జాజుల పేర్కొన్నారు.