బీసీ కుల సంఘాల మద్దతు కాంగ్రెస్‌కే..
ABN , Publish Date - Apr 02 , 2024 | 04:33 AM
సామాజిక న్యాయం కాంగ్రె్‌సతోనే సాధ్యమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దండ్రు కుమారస్వామి అన్నారు. లోక్‌సభ
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయం కాంగ్రె్‌సతోనే సాధ్యమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దండ్రు కుమారస్వామి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీసీ కుల సంఘాల మద్దతు కాంగ్రె్‌సకేనని ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో బీసీ కులసంఘాల అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. జనాభా దామాషా ప్రకారం ప్రజలు హక్కులు పొందడం ప్రజాస్వామిక, సామాజిక న్యాయమని, అది కులగణనతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాజ్యాధికారం దక్కే వరకు బీసీలు పోరాడాలని పిలుపునిచ్చారు.