Bathukamma Sambaralu: వేములవాడలో ప్రారంభమైన సద్దుల బతుకమ్మ సంబరాలు
ABN , Publish Date - Oct 08 , 2024 | 09:17 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో మంగళవారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. స్థానిక మూల వాగులో బతుకమ్మ నిమజ్జనానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గౌరీ మాత అమ్మవారిని బతుకమ్మ ఘాట్ వరకు మున్సిపల్ పాలకవర్గం ఊరేగింపుగా తీసుకు వెళ్లింది.
వేములవాడ, అక్టోబర్ 08: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో మంగళవారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. స్థానిక మూల వాగులో బతుకమ్మ నిమజ్జనానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గౌరీ మాత అమ్మవారిని బతుకమ్మ ఘాట్ వరకు మున్సిపల్ పాలకవర్గం ఊరేగింపుగా తీసుకు వెళ్లింది.
Also Read: Kavita: చనిపోయిందనుకున్నారు.. ప్రియుడితో అడ్డంగా దొరికిపోయింది.. కవితా మజాకా
ఇక వేములవాడ పట్టణంలో సంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క సైతం బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఇక వేములవాడలో కొలువు తిరిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు దర్శించుకున్నారు.
Also Read: South Central Railway: దసరా వేళ.. 770 ప్రత్యేక రైళ్లు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. అయితే అందరూ సద్దుల బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. కానీ వేములవాడలోని రాజన్న సన్నిధిలో మాత్రం ఏడు రోజులు మాత్రమే ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
Also Read: బత్తాయి తింటే ఇన్ని లాభాలున్నాయా..?
Also Read: Dasara Navaratri 2024: శరన్నవరాత్రుల్లో అతి ముఖ్యమైన రోజు.. ఎప్పుడంటే..?
తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను బతుకమ్మ పండగ ప్రతిబింబిస్తుంది. అదీకాక ఈ మాసంలో వచ్చిన బతుకమ్మ, దసరా పండుగలే పెద్ద పండగలన్న విషయం విధితమే. ఏడాదికి ఒకసారి ఈ పండుగలు వస్తున్న నేపథ్యంలో వీటిని ప్రజలు చాలా అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ పండుగను తొమ్మిది రోజులపాటు చేసుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.
Also Read: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 2024: ఫలితాలు
For Telangana News And Telugu News