Share News

విత్తనాల కోసం బారులు

ABN , Publish Date - May 22 , 2024 | 11:28 PM

జనుము, జీలుగ విత్తనాల కోసం రైతులు శంకర్‌పల్లి వ్యవసాయ కార్యాలయం వద్దకు బుధవారం పెద్దఎత్తున తరలివచ్చారు.

 విత్తనాల కోసం బారులు
జనుము, జీలుగ విత్తనాల కోసం బారులు తీరిన రైతులు

శంకర్‌పల్లి, మే 22 : జనుము, జీలుగ విత్తనాల కోసం రైతులు శంకర్‌పల్లి వ్యవసాయ కార్యాలయం వద్దకు బుధవారం పెద్దఎత్తున తరలివచ్చారు. అధికారులు ఇంతకుముందే రైతులకు టోకెన్లు ఇవ్వడంతో ఉదయం 9 గంటలకే కార్యాలయం వద్ద బారులు తీరారు. అయితే, వ్యవసాయాధికారులు 10 గంటలకు జనుము, జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. మండలానికి జనుము విత్తనాలు 150 క్వింటాళ్లు రాగా, జీలుగ విత్తనాలు 44 క్వింటాళ్లు వచ్చాయి. ఒక్కో రైతుకు పట్టాదారు పాసు పుస్తకంపై ఒక బస్తాను అందజేశారు. జనుములు ఒక బస్తాలో 40 కిలోలు ఉండగా, జీలుగలు 30 కిలోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, జీలుగలు 30 క్వింటాళ్లు మిగిలాయని, జనుములు నేడు(గురువారం) మరో 60 క్వింటాళ్లు అందుబాటులో ఉంచుతామని వ్యవసాయాధికారి సురేష్‌బాబు తెలిపారు.

Updated Date - May 22 , 2024 | 11:29 PM