Share News

Manchiryāla- బడీడు పిల్లలను గుర్తించాలి

ABN , Publish Date - May 31 , 2024 | 10:47 PM

బడీడు పిల్లలను గర్తించి పాఠశాలల్లో చేర్పించాలని కాసిపేట నోడల్‌ ఆఫీసర్‌ రాథోడ్‌ రమేశ్‌ అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో బడిబాట కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు.

Manchiryāla-      బడీడు పిల్లలను గుర్తించాలి
మాట్లాడుతున్న నోడల్‌ ఆఫీసర్‌ రాథోడ్‌ రమేష్‌

కాసిపేట, మే 31 : బడీడు పిల్లలను గర్తించి పాఠశాలల్లో చేర్పించాలని కాసిపేట నోడల్‌ ఆఫీసర్‌ రాథోడ్‌ రమేశ్‌ అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో బడిబాట కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్‌ 3 నుంచి 19 వరకు జరిగే బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామాల్లో పర్యటించి బడీడు పిల్లలు, బడి మానేసిన పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్నభోజనం గురించి తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో సత్యనారాయణసింగ్‌, ఎంపీవో నాగరాజు, ఏపీఎం వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ రాధిక, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భీమారం: మండలంలో జూన్‌ 1నుంచి చేపట్టే బడిబాట కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని ఎంపీడీవో రాధోడ్‌ రాఽధ అన్నారు. శుక్రవారం భీమారంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రధానోపాఽ ద్యాయులకు , ఉపాధ్యా యులకు యూనిఫాంలను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సదానందం, సురేష్‌, ఐకేపీ సిబ్బంది శంకర్‌, త్రయంబకేశ్వర్‌, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

భీమిని,: ఎంపీడీవో కార్యాలయంలో మండల సమాఖ్య మహిళలతో ఎంపీడీవో గంగమోహన్‌ ప్రత్యేక కార్యాక్రమం ఏర్పాటు చేసి మాట్లాడారు. జూన్‌ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని, ప్రతీ గ్రామంలో పాఠవాలల్లో ర్యాలీలు నిర్వహిస్తూ చదువు యోక్క ప్రాముఖ్యతను చాటి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఎల్‌పీవో సఫ్దార్‌ అలీ, ఏపీఎం పంజాల ప్రకాష్‌గౌడ్‌, ఎస్సై విజయ్‌ కుమార్‌, ఏపీవో భాస్కర్‌రావు, జీఎచ్‌ఎం కృష్ణమూర్తి, మండల సమాఖ్య అధ్యక్షురాలు విమల, ఐసీడీఎస్‌ సిబ్బంది, గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

దండేపల్లి: బడీడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి కృషి చేయాలని తహసీల్దార్‌ సంధ్యరాణి సూచించారు. జూన్‌ 1 నుంచి 19 వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమంపై శుక్రవారం దండేపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, అధికారులు, ఐకేపి సీఏ, వీవోఏ, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్‌, ఎంపీవో శ్రీనివాస్‌, ఐకేపీ ఏిపూఈఎం బ్రహ్మయ్య, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు విజయలక్ష్మి, చిన్న నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

వేమనపల్లి: బడిబాట కార్యక్రమంలో భాగంగా బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎంపీవో శ్రీపతి బాపురావు అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో నోడల్‌ అధికారి శ్రీధర్‌రెడ్డి, ఏపీఎం ఉమారాణి, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ సువర్ణ, సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మీనారాయణ, సీఆర్‌పీలు అశోక్‌, వెంకటేష్‌, సీసీలు శివరాం, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

తాండూర్‌: బడిబాట కార్యక్రమంపై శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాస్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహిం చారు. కార్యక్రమంలో సీఐ కుమారస్వామి, మండల నోడల్‌ అధికారి మల్లేశం, ఏపీఎం పోమానాయక్‌, పంచాయతీ కార్యదర్శులు, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

లక్షెట్టిపేటరూరల్‌ : గ్రామాల్లో అన్ని శాఖల సమన్వయంతో బడిబాటను విజయవంతం చేయాలని లక్షెట్టిపేట మండల ప్రత్యేకాధికారి సురేఖ కోరారు. శుక్రవారం ప్రధానోపాధ్యాయులకు, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ,తదితర శాఖలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జీ ఎంపీడీవో ప్రసాద్‌, ఏవో ప్రభాకర్‌, ఏపీఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 10:47 PM