Share News

శరణుఘోషతో మార్మోగిన అయ్యప్ప గుట్ట

ABN , Publish Date - Dec 28 , 2024 | 01:07 AM

స్వామియే శరణం అ య్యప్ప... అను నామస్మరణతో కోరుట్ల పట్టణం పులకరించిపోయిం ది.

శరణుఘోషతో మార్మోగిన అయ్యప్ప గుట్ట
అయ్యప్ప స్వామికి పూజలు చేస్తున్న వేదపండితులు

కన్నుల విందుగా పదునెట్టాంబడి మహోత్సవం

- ప్రత్యేక పూజలలో పాల్గొన్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

కోరుట్ల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : స్వామియే శరణం అ య్యప్ప... అను నామస్మరణతో కోరుట్ల పట్టణం పులకరించిపోయిం ది. కేరళ రాష్ట్రంలోని శబరిమల పుణ్యక్షేత్రంలో జరిపే మండల పూజ ను పురస్కరించుకొని జాతరోత్సవాన్ని పట్టణంలోని అల్లమయ్య గు ట్ట ప్రాంతంలో వెలిసిన జ్ఞాన సరస్వతి శనైశ్చరస్వామి సమేత అ య్యప్ప దేవాలయంలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. జగి త్యాల, సిరిసిల్ల, నిర్మల్‌, నిజామాబాదు జిల్లాల నుంచి అయ్యప్ప స్వాములు, భక్తులతో పాటు కోరుట్ల పట్టణానికి చెందిన వేల మంది భక్తులు అయ్యప్ప స్వామి జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు పాలెపు రాంశర్మ, వినయ్‌, కపిల్‌ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ అభివృద్ధి కమిటీ పాలకవర్గం ఆధ్వ ర్యంలో పదునెట్టాంబడి మహోత్సవం భక్తుల కరత్వాల ధ్వనుల మ ధ్య కన్నుల విందుగా సాగింది. ఉదయం ఆలయంలో పదునెట్టాం బడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులను అందిం చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన మహోత్సవ కార్యక్రమాన్ని గురు స్వాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వర భజన మండలి అధ్యక్షుడు గట్ల అనంద్‌ ఆ ధ్వర్యంలో భజనా కార్యక్రమం చేపట్టారు. అయ్యప్ప ఉత్సవ విగ్రహా న్ని ప్రత్యేక రథం ద్వారా అల్లమయ్యగుట్ట ప్రాంతంలో రథయాత్ర నిర్వహించారు. శోభయాత్రకు మహిళలు మంగళహారతులతో స్వాగ తం పలుకుతూ రోడ్డు వెంబడి నీటి బిందెలతో రహదారిని శుభ్రపరిచారు. అయ్యప్ప స్వాములు, కుల సంఘాల సభ్యులు స్వా మి వారికి వస్తాలను బహుకరించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలచే కుంకమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోరుట్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య-అనిల్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జువ్వాడి కృష్ణారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్‌లు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన సరస్వతి, శనైశ్వర స్వామి అయ్యప్ప దేవా లయ అయ్యప్ప అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షుడు చిద్రాల నారా యణ, అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్‌తో పాటు కమిటీ సభ్యులు కౌన్సి లర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడు తూ అయ్యప్ప దీక్షతో ఆధ్యాత్మిక చింతన చేకూరుతుందన్నారు. ఆల యానికి మొదటి సారిగా విచ్చేసిన ఆది శ్రీనివాస్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావులతో ఆలయ అభివృద్ధి చేస్తానని తెలిపారు.

పోలీసుల భారీ బందోబస్తు...

అయ్యప్ప జాతర మహోత్సవానికి కోరుట్ల సర్కిల్‌ పరిధిలోని పోలీసులు ప్రత్యేక బందోబస్తును నిర్వహించారు. మెట్‌పల్లి డిఎస్‌పీ అడ్డూరి రాములు పర్యవేక్షణలో మెట్‌పల్లి సీఐ కోరుట్ల ఇన్‌చార్జి ని రంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిం చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పత్ర్యేక మోబైల్‌ పార్టీల ద్వార పెట్రోలింగ్‌ నిర్వహించారు.

కోరుట్ల రూరల్‌ : పట్టణంలో మాస్ర్టో కళాశాల ఆధ్వర్యంలో అ య్యప్ప స్వామి జాతర మహోత్సవానికి పాల్గొనే భక్తుల కోసం ఉచి త బస్సు సౌకర్యం కల్పించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలను నుంచి తరలివెళ్లే భక్తులను అయ్యప్ప గుట్ట ప్రాంతం తరలించేలా చర్యలు తీసుకున్నారు.

Updated Date - Dec 28 , 2024 | 01:07 AM