Share News

Kumaram Bheem Asifabad- నకిలీ విత్తనాలను అరికడుతాం

ABN , Publish Date - May 24 , 2024 | 10:47 PM

నకిలీ విత్తనాలను అధికారుల సమన్వయంతో అరికడుతామని, రైతులు నష్టపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేవ మందిరంలో ఎరువుల విక్రయాల డీలర్లు, ఏవోలు, ఏఈవోలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్‌, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఇన్‌చార్జి వ్యవసాయాదికారి కృష్ణారెడ్డిలతో కలిసి సమావేశమయ్యారు.

Kumaram Bheem Asifabad-     నకిలీ విత్తనాలను అరికడుతాం
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, మే 24: నకిలీ విత్తనాలను అధికారుల సమన్వయంతో అరికడుతామని, రైతులు నష్టపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేవ మందిరంలో ఎరువుల విక్రయాల డీలర్లు, ఏవోలు, ఏఈవోలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్‌, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఇన్‌చార్జి వ్యవసాయాదికారి కృష్ణారెడ్డిలతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు, నిషేధిత పురుగుల మందు అమ్మితే సహించేది లేదన్నారు. పీడీయాక్టు నమోదుతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందు అమ్మకుండా వ్యవసాయాధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. ప్రతి షాపు ముందు ఎరువులు, విత్తనాల ధరల పట్టిక వివరాలను ఉంచాలన్నారు. డీలర్‌ షాపు లైసెన్సు వివరాలను ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తనాలు, ఎరువులను విక్రయించాలన్నారు. నకిలీ విత్తనాలు రవాణా, విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ విత్తన కార్పొరేషన్‌ చర్యలు చేపడుతామని, విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను విక్రయించాలని చెప్పారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు సంబందించిన రశీదును తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయాల వల్ల రైతులు నష్ట పోయినట్లయితే డీలర్లు, సంబంధిత కంపెనీ యజమానులపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విత్తనాలు, ఎరువుల నిలువల వివరాలను రోజు వారిగా రిజిస్టర్‌లో పొందు పర్చాలన్నారు. రైతులు విత్తనాలు ఖాళీ సంచులను పంట కాలం పూర్తయే వరకు భద్ర పర్చుకోవాలని, ఒక వేళ రైతు నష్ట పోయినట్లయితే ఆయా కంపెనీ నుంచి నష్ట పరిహారం పొందేందకు అవకాశం ఉంటుందని తెలిపారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలు, పోలీసు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సమన్వయంతో జిల్లాలో నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలను అరికట్టాలని తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, వ్యవసాయాధికారులు, ఏఈవోలు, డీలర్లు, ఫర్టిలైజర్‌ దుకాణాల యజమానులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 10:47 PM