Share News

అందుబాటులో ఎరువులు, విత్తనాలు

ABN , Publish Date - May 31 , 2024 | 11:16 PM

జిల్లాలో రైతు లకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందు బాటులో ఉన్నాయని, లైసెన్స్‌ కలిగిన డీలర్లతోనే విత్తనాలు కొనుగోలు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

అందుబాటులో ఎరువులు, విత్తనాలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష, పక్కన ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌

- లైసెన్స్‌ కలిగిన డీలర్లతోనే

విత్తనాలు కొనుగోలు చేయాలి

- సమావేశంలో కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష

నారాయణపేట టౌన్‌, మే 31: జిల్లాలో రైతు లకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందు బాటులో ఉన్నాయని, లైసెన్స్‌ కలిగిన డీలర్లతోనే విత్తనాలు కొనుగోలు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రజావాణి హాల్‌లో ఎస్పీ యోగేష్‌ గౌతంతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మా ట్లాడుతూ రాబోయే వర్షాకాలం 2024కి గానూ జీలుగ విత్తనాలు 1700 క్వింటాళ్లు కేటాయించ బడ్డాయన్నారు. జిల్లాలోని ఆగ్రో రైతు సేవా కేం ద్రాలు, పీఏసీఎస్‌ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 999.60 క్వింటాళ్ల విత్తనాలు 60 సబ్సిడీపై 1776 మంది రైతులకు అందజేసినట్లు తెలిపారు. మిగిలిన 700 క్వింటాళ్లు వచ్చే వారంలోపై సరఫ రా చేస్తామన్నారు. జిల్లాలో ఉష్టోగ్రతలు తగ్గిన తర్వాతనే రైతులు విత్తనాలు వేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో 1.85లక్షల ఎకరాల్లో పత్తిసాగు అవుతుందన్న అంచనాతో 3.70లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం ఉండగా ఇప్ప టికే 1.31లక్షలకు పైగా పత్తి విత్తనాల ప్యాకెట్లు రైతులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. విత్త నాలు వేసిన తర్వాత కూడా విత్తన సంచులను, సంబంధిత బిల్లులను భద్రంగా ఉంచుకోవా ల న్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇ వ్వాలని కోరారు. ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ మా ట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌ నమోదుకు కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో పోలీస్‌, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులచే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసిన ట్లు చెప్పారు. లూజ్‌ విత్తనాలు ఎవరూ కూడా కొనవద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయానికి సంబంధించి ఇప్పటివరకు ఐదు కేసులు నమోదు కాగా, ఒక క్వింటాళ్ల నకిలీ విత్తనాలు సీజ్‌ చేశామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్‌సుధాకర్‌, డీపీఆర్‌వో రషీద్‌ పాల్గొన్నారు.

కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా నకిలీ ఎ రువులు, విత్తనాల కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌ వీసీ హాల్‌లో ఎస్పీ యోగేష్‌ గౌతంతో కలిసి అధికారులతో సమావేశం ని ర్వహించి మాట్లాడారు. జిల్లాలో 245 మంది వి త్తన డీలర్ల దగ్గర ఉన్న విత్తనాల దుకాణాలను, గోదాంలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల న్నారు. తహసీల్దార్లు స్టాక్‌ను, ఆన్‌లైన్‌ లావాదేవీ లను పరిశీలించాలని ఆదేశించారు. అక్రమ విత్తనాల వ్యాపారం జరగకుండా రికార్డులు పరి శీలించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్య లు తప్పవని హెచ్చరించారు. అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, ఆర్డీవో మధుమోహన్‌తో పాటు జిల్లాలోని ఎస్‌ఐలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 11:16 PM