Share News

జలశక్తి అభియాన్‌ ద్వారా నీటి నిల్వల పెరుగుదలజలశక్తి అభియాన్‌ ద్వారా నీటి నిల్వల పెరుగుదల

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:27 PM

జలశక్తి అభియాన్‌ ద్వారా నీటి నిల్వల పెరుగుదుల సాధ్యమైందని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. మంగళవారం జిల్లా సందర్శనకు వచ్చిన జలశక్తి అభియాన్‌ కేంద్ర నోడల్‌ బృంద సభ్యులు అంకిత్‌ మిశ్రా, డిప్యూటీ సెక్రటరీ అంకిత్‌ విశ్వకర్మ, సైంటిస్ట్‌లను జిల్లా యంత్రాంగం తరపున అదనపు కలెక్టర్‌ ఆహ్వానించారు.

జలశక్తి అభియాన్‌ ద్వారా నీటి నిల్వల పెరుగుదలజలశక్తి అభియాన్‌ ద్వారా నీటి నిల్వల పెరుగుదల
మాట్లాడుతున్న జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ -

జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

రంగారెడ్డి అర్బన్‌, జనవరి 30 : జలశక్తి అభియాన్‌ ద్వారా నీటి నిల్వల పెరుగుదుల సాధ్యమైందని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. మంగళవారం జిల్లా సందర్శనకు వచ్చిన జలశక్తి అభియాన్‌ కేంద్ర నోడల్‌ బృంద సభ్యులు అంకిత్‌ మిశ్రా, డిప్యూటీ సెక్రటరీ అంకిత్‌ విశ్వకర్మ, సైంటిస్ట్‌లను జిల్లా యంత్రాంగం తరపున అదనపు కలెక్టర్‌ ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. జలశక్తి అభియాన్‌ ద్వారా జిల్లాలో చేపట్టిన పనులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్‌ జలశక్తి అభియాన్‌ బృందానికి వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జలశక్తి అభియాన్‌ ద్వారా నీటిని నిల్వ ఉంచే ప్రయత్నంలో ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, బోరు బావులు, చెరువులు, చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం చేసుకుని నీటి ఒడిసి పట్టి జిల్లాలో వరి పంటలు, పండ్లు, పూల సాగు చేస్తున్న విధానాన్ని బృందానికి వివరించారు. జిల్లాలో తాగునీటి, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులూ లేవని తెలిపారు. జిల్లాలో 558 గ్రామ పంచాయతీలలో హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి, నాటిన మొక్కలను సంరక్షణ చేస్తూ పచ్చదనం పెంచుతున్నామని చెప్పారు. గ్రామ నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి పచ్చదనం పెంపొందించామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో దిలీప్‌కుమార్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్‌, అడిషనల్‌ పీడీ నీరజ, వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, ఉద్యానవన శాఖ, అటవీ శాఖ అధికారి సుధాకర్‌రెడ్డి, ఇరిగేషన్‌ శాఖ అధికారి బన్సీలాల్‌, మిషన్‌ భగీరథ అధికారి, మున్సిపల్‌ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:28 PM