బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:24 PM
కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలని, సింగరేణికి బొగ్గు బ్లాకులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యం
పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
మేడ్చల్ జూలై 5(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలని, సింగరేణికి బొగ్గు బ్లాకులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సత్యం మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని మూయించాలని కేంద్రం చూస్తున్నదని ఆరోపించారు. సింగరేణి కాలరీ్‌సకు నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రవి, అశోక్, వినోద, సంతోష్, శ్రీనివాసులు, లింగస్వామి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి:: జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య
రంగారెడ్డి అర్బన్, : మోదీ ప్రభుత్వం సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు గనుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో శుక్రవారం వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థను కార్పొరేట్ సంస్థలకు అమ్మే కుట్ర చేయడం దుర్మార్గమని విమర్శించారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌లను సింగరేణి సంస్థకే కేటాయించే వరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రాచారి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు, ముత్యాల యాదిరెడ్డి, కావలి నర్సింహ, ఓరుగంటి యాదయ్య, కె. రామస్వామి, టి. రామకృష్ణ, సీపీఎం నాయకులు నర్సింహులు, అల్లంపల్లి బాలరాజు, కిషన్, ిసీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, రామకృష్ణారెడ్డి, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.