Share News

యువతిపై అత్యాచారయత్నం

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:21 AM

తల్లిదండ్రుల మధ్య విభేదాల నేపథ్యం లో తల్లితో కలిసి చిన్నమ్మ ఇంట్లో తలదాచుకుంటున్న ఓ యువతిపై వరుసకు బాబాయ్‌ అత్యాచారయత్నం చేశాడు.

 యువతిపై అత్యాచారయత్నం

యువతిపై అత్యాచారయత్నం

వరుసకు కుమార్తెపై అఘాయిత్యం

పరారీలో నిందితుడు

మిర్యాలగూడ, ఫిబ్రవరి 1: తల్లిదండ్రుల మధ్య విభేదాల నేపథ్యం లో తల్లితో కలిసి చిన్నమ్మ ఇంట్లో తలదాచుకుంటున్న ఓ యువతిపై వరుసకు బాబాయ్‌ అత్యాచారయత్నం చేశాడు. మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ టూ టౌన ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. యువతి (19) తల్లిదండ్రుల మధ్య విభేదాలు రావడంతో పట్టణంలోని తన చిన్నమ్మ చాంద్‌ సు ల్తానా ఇంట్లో తల్లితో పాటు మూడు నెలలుగా ఆశ్రయం పొందుతోంది. అప్పటికే చాంద్‌సుల్తానా మరిది ఆరీఫ్‌ భార్య అతనితో గొడవపడి కొంతకాలం క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఒంటరిగా ఉంటున్న ఆరీఫ్‌ తనను పెళ్లి చేసుకోవాలని వదిన చాంద్‌సుల్తానాతో కొంతకాలంగా యువతిపై ఒ త్తిడి తెచ్చేవాడు. ఆ యువతి అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. తనకు సహకరించాల్సిందిగా చాంద్‌సుల్తానాను కోరగా ఆమె అంగీకరించింది. ఆమెను శారీరకంగా లొంగదీసుకుంటే తప్ప పెళ్లికి అంగీకరించదని యువతిపై లైంగికదాడి చే సేందుకు ఇద్దరూ కలిసి పధకం రూపొందించారు. గత నెల 28వ తేదీన యువతి ఒంటరిగా గదిలో ఉన్న సమయంలో యువతి చిన్నమ్మ, ఆరీఫ్‌ వదిన అయిన చాంద్‌సుల్తానా ఆరీ్‌ఫను యువతి గదిలోకి పంపి తలుపు లు మూసింది. గదిలోకి వెళ్లిన ఆరీఫ్‌ యువతిపై పడి అఘాయిత్యం చే యబోగా పెనుగులాటలో ఆరీఫ్‌ చేయిని గట్టిగా కొరికింది. బాధతో ఆరీఫ్‌ కేకలు వేయడంతో ఏం జరుగుతుందోనని చాంద్‌సుల్తానా తలుపులు తెరవగా ఆరీ్‌ఫను విడిపించుకుని యువతి గది నుంచి బయటకు వచ్చింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని భయపెట్టి ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా, తల్లికి తెలియకుండా చూసుకున్నారు. బుధవారం రాత్రి చాంద్‌సుల్తానా కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో నుంచి బయటపడి మరో కాలనీలో నివసిస్తున్న తండ్రి, నాయనమ్మల వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పి విలపించడంతో వారు టూటౌన పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆరీ్‌ఫతోపాటు అతని వదిన చాంద్‌సుల్తానాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. యువతిపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు గతంలో అధికార పార్టీ విద్యార్థి విభాగం జిల్లా నాయకుడిగా పనిచేసినట్లు సమాచారం. చాంద్‌సుల్తానాను పోలీసులు అ దుపులోకి తీసుకోగా, నిందుతుడు ఆరీఫ్‌ పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ కృష్ణ య్య తెలిపారు. తండ్రి సంరక్షణలో ఉ న్న బాధిత యువతిని వైద్య పరీక్ష ల నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - Feb 02 , 2024 | 12:21 AM