Share News

అట్టహాసంగా సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:58 PM

మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. ఘట్‌కేసర్‌ మండలం, ప్రతా్‌పసింగారంలోని సుధీర్‌రెడ్డి నివాసానికి మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రె్‌సపార్టీ శ్రేణులు, అభిమానులు, భారీ సంఖ్యలో చేరుకుని పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అట్టహాసంగా సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకలు
మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్‌ కట్‌చేయిస్తున్న గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్‌ బేరి ఈశ్వర్‌ తదితరులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఫిబ్రవరి 17: మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. ఘట్‌కేసర్‌ మండలం, ప్రతా్‌పసింగారంలోని సుధీర్‌రెడ్డి నివాసానికి మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రె్‌సపార్టీ శ్రేణులు, అభిమానులు, భారీ సంఖ్యలో చేరుకుని పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సుధీర్‌రెడ్డి తనయుడు జడ్పీచైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రే్‌షయాదవ్‌, డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డి, గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్‌ బేరి ఈశ్వర్‌, కందుల కుమార్‌, మాజీ సర్పంచ్‌లు సుధీర్‌రెడ్డితో కేక్‌కట్‌ చేయించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Updated Date - Feb 17 , 2024 | 10:58 PM