Share News

ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక వసతులపై ఆరా

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:03 PM

జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మౌలిక వసతులపై మెడికల్‌ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌ నవకళ్యాణి, కమిటీ సభ్యులు డాక్టర్లు రమేష్‌, కిరణ్‌ ఆరా తీశారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక వసతులపై ఆరా
సమావేశంలో పాల్గొన్న వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌, కమిటీ సభ్యులు

- మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నవకళ్యాణి, కమిటీ సభ్యులు

గద్వాల న్యూటౌన్‌, జనవరి 12: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మౌలిక వసతులపై మెడికల్‌ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌ నవకళ్యాణి, కమిటీ సభ్యులు డాక్టర్లు రమేష్‌, కిరణ్‌ ఆరా తీశారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిశోర్‌కుమార్‌ తో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఏ స దుపాయాలు ఉన్నాయి, ప్రతీ రోజు ఎన్ని ఓపీలు నిర్వహిస్తున్నారు, మె రుగైన వసతులు ఉన్నాయా, డయాలసిస్‌, ఐసీయూలో విధులు ఏలా ఉన్నాయి, రోగులకు సకాలంలో వైద్యసేవలు అందిస్తున్నారా అనే అం శాలపై ఆరా తీశారు. అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కొత్తగా ఏర్పాటు అయ్యే 300 పడకల ఆసుపత్రి ఎంత దూరంలో ఉన్నది. అక్క డ పూర్తి స్థాయిలో సదుపాయాలు అందుబాటులోకి వస్తాయే అనే విషయాలపై సూపరింటెండెంట్‌తో చర్చించారు. అనంతరం నూతనంగా ఏ ర్పాటు అయ్యే 300 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. రోగులకు సకాలంలో వైద్యసేవలందేలా అందరం కలిసి కృషి చేద్దామని వా రు సూచించారు. సమావేశంలో డాక్టర్‌ నవీన్‌క్రాంతి తదితరులున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:03 PM