Share News

నకిలీ పత్రాలతో పాస్‌పోర్టుల కేసులో ఏఎస్ఐ..

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:43 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి పాస్‌పోర్టులు జారీ చేయించిన కేసులో మరో ముగ్గురు నిందితులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

నకిలీ పత్రాలతో పాస్‌పోర్టుల కేసులో ఏఎస్ఐ..

  • అతడితో పాటు మరో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి పాస్‌పోర్టులు జారీ చేయించిన కేసులో మరో ముగ్గురు నిందితులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో నిజామాబాద్‌ జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ ఐ లక్ష్మణ్‌ సైతం ఉండడం గమనార్హం. మిగతా ఇద్దరు ఆదిలాబాద్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలో పనిచేస్తున్న పోస్టల్‌ అసిస్టెంట్‌ ప్రణబ్‌, ముంబైకు చెందిన ఏజెంట్‌ అని సీఐడీ అడిషనల్‌ డీజీ శిఖా గోయల్‌ గురువారం తెలిపారు. వీరితో కలిపి మొత్తం 14 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరిన్ని కీలక వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. ఈ ముఠా శ్రీలంక నుంచి అక్రమంగా వలస వచ్చినవారికి ఇప్పటివరకు 95 పాస్‌పోర్టులు జారీ చేసిందని తెలిపారు.

Updated Date - Feb 02 , 2024 | 07:37 AM