manchiryala- ఆందోళన బాటలో ‘ఆశా’లు
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:09 PM
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సేవలందించే ఆశా వర్కర్లు ఆందోళన చెందుతు న్నారు.

- ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని ఆవేదన
- రేపు ‘చలో హైదరాబాద్‌కు పిలుపు
నస్పూర్, జూలై 28: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సేవలందించే ఆశా వర్కర్లు ఆందోళన చెందుతు న్నారు. వ్యాధులు వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో పర్యటించి సమాచా రం వైద్యులకు చేరవేయడం, 0-5 ఏళ్ల వయస్సు గల పిల్లల జాబితను రూపొందించడం, గర్భిణులకు, వ్యాధుల బారిన పడిన వారి సేవలం దించడంలో ఆశా వర్కర్లది కీలక పాత్ర. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు-17, అర్బన్ హెల్త్ సెంటర్లు-4, బస్తీ దవాఖానాలు-3, ఉపకేంద్రాలు-146, నిరంతరం పని చేసే ఆరోగ్య కేంద్రాలు-9 ఉన్నాయి. జిల్లాలోని ఆస్పత్రులు పరిధిలో దాదాపు 660 మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సేవలందించినప్పటికీ తమకు కనీస వేతనం అమలు చేయడంలేదని ఆశా వర్కర్లు వాపో తున్నారు. పని భారం పెరిగినా అరకొర వేతనం మాత్రమే వస్తుందని ఆవేదన చెందుతున్నారు. హక్కుల సాధన కోసం ఇటీవల ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యపై చర్చించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని తాము ఆందోళనలకు పూనుక్నుమని వారు వెల్లడించారు. ఆందోళనల్లో భాగంగా 30వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు.
ఫ సెలవు లేకుండా..
ఆరోగ్య కేంద్రాల పరిధిలో పని చేస్తున్న ఉదయం నుంచి రాత్రి వరకు సెలవు లేకుండా పని చేయాల్సి వస్తోంది. రోజు రోజుకు పని భారం పెరుగుతున్న కనీసం వేతనం పెరగడంలేదని ఆశా వర్కర్లు వాపోతున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆందోళనలు, సమ్మెలు చేసినా కంటి తుడుపుగా ఒప్పందం చేసుకుని అమలు చేయడం మరి చారు. అనాటి ప్రభుత్వం పెండింగ్ పీఆర్‌సీ, ఏరియర్స్, కరోనా రిస్క్ అలవెన్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా పట్టించుకోలేదు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చిన తర్వాత గత ఫిబ్రవరిలో ఆరోగ్య శాఖ కమిషనర్ ఆధ్వర ్యంలో చర్చలు జరిపి రూ. 50 లక్షల ఇన్సూరెన్స్, రిజిస్టర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినా నేటికి అమలుకు నోచుకోలేదని ఆశా వర్కర్లు వాపోతున్నారు. ఫిబ్రవరి లో ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నెలా కనీస వేతనం రూ. 18వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
హామీలు అమలు చేయాలి..
- నర్మద, ఆశా వర్కర్
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అన్ని హామీ లను అమలు చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పారితోషి కాలను పెంచాలి. ఆశాలకు నష్టం కలిగించే పరీక్షలను ప్రభుత్వ నిర్ణ యాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. బీసీజీ సర్వే, వ్యాక్సినేషన్ పనికి తగ్గ పారితోషికం ఇవ్వాలి.
రూ. 50లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి..
- కవిత- ఆశా వర్కర్
ప్రతీ ఆశా కార్యకర్తకు రూ 50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించా లి. ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ రూ. 5 లక్షలు చెల్లించాలి. పారితోషికంలో సగం పెన్షన్ చెల్లించాలి. పెండింగ్‌లో ఉన్న రిజిస్టర్లను తొందరగా ప్రింట్ చేసి అందజేయాలి.
పదోన్నతులు కల్పించాలి..
- యశోద- ఆశా వర్కర్
ఆశా వర్కర్లకు వేతనంతో కూడిన ఆరు నెలల మెడికల్ సెలవులు ఇవ్వాలి. ఆశాలకు ఏఎన్‌ఎం, జీఎ న్‌ఎం ప్రమోషన్ల సౌకర్యం కల్పిం చాలి. 2021 జూలై నుంచి డిసెంబరు వరకు ఆరు నెలల పీఆర్సీ ఏరి యర్స్ వెంటనే చెల్లించాలి. అధికారుల వేధింపులను నియంత్రించాలి.
హక్కుల సాధనకు పోరాటం..
- రంజిత్‌కుమార్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
ఆశా వర్కర్ల హక్కుల సాధన కోసం తాము అండగా ఉండి పోరా టం చేస్తాం. పెరుగుతున్న దరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ప్రస్తుతం నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్లకు బడ్జెట్ కేటాయించాలి. పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి.