అరుణాచలం తరహాలో కొండగట్టు గిరిప్రదిక్షణ
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:38 AM
తమిళనాడులోని అరుణాచలం వద్ద నిర్వహిస్తున్న తరహాలోనే తెలంగాణలో మొట్టమొదటగా కొండగట్టు ఆంజనేయ స్వామి గుట్ట చుట్టూ గిరిప్రదిక్షణకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. కొండగట్టు గుట్ట చుట్టూ భక్తులు చేసే గిరిప్రదిక్షణ మార్గం అ భివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఫ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
మల్యాల, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని అరుణాచలం వద్ద నిర్వహిస్తున్న తరహాలోనే తెలంగాణలో మొట్టమొదటగా కొండగట్టు ఆంజనేయ స్వామి గుట్ట చుట్టూ గిరిప్రదిక్షణకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. కొండగట్టు గుట్ట చుట్టూ భక్తులు చేసే గిరిప్రదిక్షణ మార్గం అ భివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహిం చి మట్టి తవ్వారు. గిరిప్రదిక్షణ మార్గాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడు తూ తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కొండగట్టులో గిరి ప్రదక్షణ కోసం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ రూ.2 లక్షలు సొంతంగా ఇచ్చారని, అందులో భాగంగా పనులను చేపట్టినట్లు పేర్కొ న్నారు. కొండగట్టుకు లక్షలాదిగా వచ్చే భక్తులు, దీక్షపరులు వస్తుండగా భక్తుల కోరిక మేరకు అన్ని సౌకర్యాలతో కూడిన గిరిప్రదిక్షణకు చర్యలు తీసుకుంటున్న ట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో అంజయ్య, మ ల్యాల, కొడిమ్యాల సింగిల్‌విండో చైర్మన్లు రాంలింగారెడ్డి, రాజనర్సింగరావు నాయ కులు ఆదిరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ముత్యం శంకర్, సతీశ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, అనిల్, వి నయ్, హరినాథ్, తిరుపతి, నర్సింహరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, ప్రతాప్, మల్లేశం పాల్గొన్నారు