Share News

చైనస్నాచింగ్‌ కేసులో నిందితుల అరెస్టు

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:42 AM

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని విరాట్‌నగర్‌ గ్రామంలో చైనస్నాచింగ్‌ కేసులో ఇద్దరు నిందితులను పో లీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

 చైనస్నాచింగ్‌ కేసులో నిందితుల అరెస్టు
నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

చైనస్నాచింగ్‌ కేసులో నిందితుల అరెస్టు

చింతపల్లి, జూలై 7: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని విరాట్‌నగర్‌ గ్రామంలో చైనస్నాచింగ్‌ కేసులో ఇద్దరు నిందితులను పో లీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి సీఐ నవీన, చింతపల్లి ఎస్‌ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని కుర్మేడు గ్రా మానికి చెందిన గోరటి బక్కమ్మ భర్త నర్సింహతో కలిసి గత నెల 26వ తేదీన విరాట్‌నగర్‌ కాలనీ సమీపంలో ఉన్న వ్యవసాయ పొలానికి ద్వి చక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాలేంపల్లి గ్రామానికి చెందిన కుర్రా తుల్చానాయక్‌, సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ధరావత బాలకృష్ణ ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చారు. బైక్‌పై వెళ్తున్న బక్కమ్మతో మాటమాట కలిపారు. అనంతరం ఆమె మెడలో నుంచి 4 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు దేవరకొండ డీఎస్పీ గిరిబాబు నేతృత్వంలో చింతపల్లి పోలీసులు బృందాలు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. చింతపల్లి హైవే సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీల్లోని వివరాలతో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుండగా సాయిబాబా దేవాలయ సమీపంలో ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించట్లు వారు తెలిపారు. స మావేశంలో పోలీస్‌ సిబ్బంది కిరణ్‌, శివకుమార్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:42 AM