Share News

నకిలీ పత్తి విత్తనాల నిందితుల అరెస్టు

ABN , Publish Date - Jun 02 , 2024 | 11:07 PM

జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలో గత నెల 30న పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర నిర్వహించిన వాహన తనిఖీలో పట్టుబడిన నకిలీ విత్తనాల కేసును వేగవంతంగా ద ర్యాప్తు చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అలం పూర్‌ సీఐ రవిబాబు తెలిపారు.

నకిలీ పత్తి విత్తనాల నిందితుల అరెస్టు
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న సీఐ రవి బాబు

- వివరాలు వెల్లడించిన అలంపూర్‌ సీఐ రవి బాబు

ఉండవల్లి, జూన్‌ 2: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలో గత నెల 30న పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర నిర్వహించిన వాహన తనిఖీలో పట్టుబడిన నకిలీ విత్తనాల కేసును వేగవంతంగా ద ర్యాప్తు చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అలం పూర్‌ సీఐ రవిబాబు తెలిపారు. ఆదివారం ఉండవల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నంద్యాల జిల్లా కేంద్రంలోని బబ్బూరి జిన్నింగ్‌ మిల్‌ నుంచి జెనిటిక్‌ ఫ్యూరిటీ టెస్టింగ్‌లో ఫెయిల్‌ అయిన పత్తి విత్తనాలను గతనెల 30న ఓ ప్రైవేట్‌ వాహనంలో 18 క్వింటాళ్లను నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో విక్రయించేందుకు తీసుకెళ్తుండగా నమ్మదగిన సమాచా రంతో మండల వ్యవసాయ అధికారి సురేఖ, పోలీస్‌సిబ్బంది సంయు క్తంగా తనిఖీలు చేపట్టారు. పట్టుబడిన పత్తి విత్తనాలు పంచనామాలో నకిలీవని తేలడంతో కేసు నమోదు చేసి డ్రైవర్‌ కోటేశ్వర్‌ రావును అ దు పులోకి తీసుకుని దర్యాప్తు చేసినట్లు తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తును వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. విచారణలో నంద్యాలలోని బబ్బూరి జిన్నింగ్‌ మిల్‌లో పది క్వింటాళ్లు, హైదరాబాద్‌ ఆటోనగర్‌ వనస్థలిపురం ప్రాంతంలో దాడులు నిర్వహించి మరో మూడు క్వింటాళ్ల మొత్తంగా 31 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ. 15లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. దర్యాప్తులో ఆరుగురు నిందితులను గుర్తించగా ఇందులో ఏ1 నిందితుడు అముల్‌ కుమార్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇతను హైదరాబాద్‌ కొంపల్లిలోని ఐయార్‌ క్రాప్‌ సైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపె నీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఏ2 కేఎస్‌. రాజ శేఖర్‌, ఏ3 ఉప్పరి వెంకటేశ్వర్లు, ఏ4 పాండుగయాల రాముడు, ఏ5 మే లుకోట రామశేషయ్య, ఏ6 పల్లా కోటేశ్వర్‌ రావులను అదుపులోకి తీసు కుని ఆదివారం మహబూబ్‌నగర్‌లోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రి మాండుకు తరలించినట్లు వివరించారు. దర్యాప్తులో సీసీఎస్‌ సీఐ శ్రీని వాసులు రెడ్డి, ఉండవల్లి ఎస్‌ఐ శ్రీనివాసులు నాయక్‌, ఏఎస్‌ఐ సుబ్బా రెడ్డి, రాజోలి ఎస్‌ఐ జగదీష్‌ , పోలీస్‌ సిబ్బంది రెండు రోజులలోనే కేసు ను ఛేదించినందుకు ఎస్పీ రితిరాజ్‌ అభినందించినట్లు తెలిపారు. పరారీ లో ఉన్న ఏ1 నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. సమావేశంలో సీసీఎస్‌ సీఐ శ్రీనివాసు లురెడ్డి, ఉండవల్లి ఎస్సై శ్రీనివాసులునాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 11:07 PM