Share News

దేవరకొండలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - May 12 , 2024 | 12:19 AM

దేవరకొండ నియోజకవర్గంలో ఈ నెల 13వ తేదీన జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆర్డీవో శ్రీరాములు తెలిపారు.

 దేవరకొండలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

దేవరకొండలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

దేవరకొండ, మే 11: దేవరకొండ నియోజకవర్గంలో ఈ నెల 13వ తేదీన జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆర్డీవో శ్రీరాములు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో 328 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో 1,31,838 మంది పురుషులు, 1,30,624 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో 26 సమస్మాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక బలగాలతో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు దేవరకొండ డీఎస్పీ గిరిబాబు తెలిపారు. నియోజకవర్గంలో 600 మందికిపైగా బలగాలు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటాయని అన్నారు. సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక పోలీస్‌ బలగాలతో బందోబస్తు చేశామన్నారు.

డిండి: లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లు పూర్తయిన ట్లు తహసీల్దార్‌ తిరుపతయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని 52 పోలింగ్‌ కేంద్రాల్లో 46 వేల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు. వేసవి దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీటి వసతి, వైద్యసిబ్బంది అందుబాటులో ఉండే వి ధంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్లు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమ ఓటును వినియోగించుకోవచ్చని అన్నారు. మండలంలో సమస్మాత్మక గ్రామాలుగా గుర్తించిన గోనబోయినపల్లి, దేవతపల్లితండా, ప్రతా ప్‌నగర్‌, ఎర్రారం, టి.గౌరారం, తవక్లాపూర్‌ గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద సాయుధ పోలీసులు బందోబస్తు చేస్తారని తెలిపారు.

Updated Date - May 12 , 2024 | 08:19 AM