Manchiryāla- సాయుధ పోరాటం భావితరాలకు ఆదర్శం
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:10 PM
నైజాం రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భావి తరాలకు ఆదర్శమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య అన్నారు. పట్టణం లోని భగత్‌సింగ్ స్తూపం వద్ద ఆదివారం జెండా ఆవిష్కరించారు.
బెల్లంపల్లి, సెప్టెంబరు 15: నైజాం రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భావి తరాలకు ఆదర్శమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య అన్నారు. పట్టణం లోని భగత్‌సింగ్ స్తూపం వద్ద ఆదివారం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రజాకా రులకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఎంతో గొప్పదన్నారు. నాడు ప్రతీ పల్లెల్లో రజాకారులు, భూస్వాములకు కొమ్ముకాసి పేదలను చిత్రహింసలకు గురి చేశారన్నారు. ఈ పోరాటాల్లో 4,500 మందికి పైగా కమ్యునిస్టులు తమ ప్రాణాలను అర్పించారన్నారు. ఈ నెల 17 వరకు నిర్వహించే వార్షికోత్సవా లను ఘనంగా నిర్వహించుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు బొల్లం పూర్ణిమ, పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, నాయకులు దాగం మల్లేష్, బొంతల లక్ష్మినారాయణ, బియ్యాల ఉపేందర్ పాల్గొన్నారు.
మందమర్రి టౌన్: తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాలు చిరస్మర ణీయమని, ఆ పోరాటాలు ప్రజలకు స్పూర్తి నిచ్చాయని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య అన్నారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయం వద్ద ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలకు వారు ముఖ్య అతిథులుగా హాజర య్యారు. ముందుగా తెలంగాణ సాయుద పోరాటంలో అమర వీరులకు నివాలులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు సలేంద్ర సత్యనారాయణ, భీమనాథుని సుదర్శన్, కంది శ్రీనివాస్, రాజేషం, దుర్గరాజు, పెద్దపల్లి బానయ్య, తిరుపతి, గాండ్ల సంపత్, శర్మ, తదితరులు పాల్గొన్నారు.
చరిత్రను వక్రీకరించొద్దు..
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాలకులు వక్రీకరిస్తే ప్రజలు క్షమించరని సీపీఐ పట్టణ కార్యదర్శి దుర్గారాజు తెలిపారు. ఆదివారం పట్టణంలోని మార్కెట్ సెంటర్లో వారోత్సవాలను పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమర వీరుల స్థూపానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు సోముశెట్టి రాజేషం, కంది శ్రీనివాస్, మర్రికుమార్, రాజేష్ యాదవ్, రాయబారపు వెంకన్న, ఆంథోని దినేష్, జెట్టి మల్లయ్య, వెల్ది ప్రభాకర్, బియ్యాల పద్మ, ఎలిగేటి వజ్ర, తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆదివారం నస్పూర్, తాళ్లపల్లి గ్రామ సమితి ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించారు. నస్పూర్ కాలనీలో జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగం రవి, షిర్కె సెంట ర్‌లో గ్రామ కార్యదర్శి మిర్యాల రాజేశ్వర్‌రావు, మండల కార్యదర్శి జోగుల మల్లయ్యలు జెం డాలను ఎగుర వేశారు. కార్యక్రమాల్లో సీపీఐ నాయకులు కారుకురి నగేష్, రవీందర్, కొమురయ్య, రాంచందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.