Share News

ట్రాఫిక్‌ చలానా చెల్లిస్తున్నారా..?

ABN , Publish Date - Jan 03 , 2024 | 04:03 AM

పెండింగ్‌ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్‌ ఆఫర్‌కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

ట్రాఫిక్‌ చలానా చెల్లిస్తున్నారా..?

నకిలీ వెబ్‌సైట్లతో తస్మాత్‌ జాగ్రత్త!

హైదరాబాద్‌ సిటీ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్‌ ఆఫర్‌కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో యూజర్లు వెబ్‌సైట్‌ను సందర్శిస్తుండడంతో.. తరచూ సర్వర్‌ డౌన్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను సైబర్‌ కేటుగాళ్లు అవకాశంగా మలచుకుంటున్నారు. అచ్చంగా ఈచలానాల పోర్టల్‌ మాదిరిగా నకిలీ వెబ్‌సైట్ల(ఫిషింగ్‌)ను సృష్టించి, గూగుల్‌లో ‘ట్రాఫిక్‌ పెండింగ్‌ చలానా’ అని సెర్చ్‌ చేస్తే.. తమ సైట్లకు రీడైరెక్ట్‌ అయ్యేలా గిమ్మిక్కులు చేస్తున్నారు. వాటిని నమ్ముతున్న యూజర్ల జేబులను గుల్ల చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు.. అప్రమత్తంగా ఉండాలంటూ వాహనదారులను హెచ్చరిస్తున్నారు. దీనిపై సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 07:52 AM