తెలంగాణ ప్రజల త్యాగాలతోనే ఏపీ విభజన బిల్లు:ఎంపీ సురేశ్
ABN , Publish Date - Feb 06 , 2024 | 04:50 AM
తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమాలతోనే ఏపీ విభజన బిల్లు సాధ్యమైందని రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి అన్నారు. సోమవారం, రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో మంది తెలంగాణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమాలతోనే ఏపీ విభజన బిల్లు సాధ్యమైందని రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి అన్నారు. సోమవారం, రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. పదేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఉభయ సభల్లో ఏపీ విభజన హామీలపై సభ్యుల నుంచి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయన్నారు. కేంద్రం హామీలు ఇచ్చింది కానీ, అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దిష్టమైన సమయంలో హామీలు నెరవేర్చలేకపోతే.. తిరిగి పార్లమెంట్‌లో ఆ అంశాన్ని ప్రస్తావించాలని కేంద్రానికి సూచించారు. అప్పుడు దేశ ప్రజలకు ఈ సభల్లోని చిత్తశుద్ది తెలుస్తుందని వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, భాషలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ సమావేశాలు జరిగే రోజులను పొడిగించాలని కోరారు. అప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీలకు మాట్లాడే అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విపక్షాలకు కూడా అజెండా నిర్ణయించే అవకాశం ఇచ్చి, దానిపై చర్చ జరిగే ఛాన్స్ ఇవ్వాలని కోరారు. యూకేలో మాదిరిగా ఆర్ధికేతర బిల్లులపై విప్ లేకుండా ‘ఫ్రీ ఓటింగ్’ జరపాలన్నారు. అప్పుడు అధికార పక్షంలోని ఎంపీలు సైతం ేస్వచ్చగా తమ అభిప్రాయాన్ని తెలిపే అవకాశం ఉంటుందని తెలిపారు.