Share News

డ్రైవర్ల వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:08 AM

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం తో డ్రైవర్లు రోడ్డు పాలు కావడమేనని యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు భూక్యా రవి అన్నారు.

డ్రైవర్ల వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
కోదాడలో నినాదాలు చేస్తున్న డ్రైవర్లు

కోదాడ టౌన్‌, జనవరి 6: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం తో డ్రైవర్లు రోడ్డు పాలు కావడమేనని యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు భూక్యా రవి అన్నారు. కేంద్ర ప్రభుత్వం హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని తీసుకరావడాన్ని నిరసిస్తూ శనివారం లారీ డ్రైవర్లు పట్టణంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం అనుకోకుండా జరుగుతుందని, ఆ నెపంతో లారీడ్రైవర్లకు పదేళ్లు జైలు శిక్ష రూ.7 లక్షల జరిమానా అంటూ తెచ్చిన కొత్త చట్టా న్ని కేంద్రం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాజునాయక్‌, శివలాల్‌, శ్రీను, నాగేశ్వరరావు, చంద్రశేఖర్‌ ఉన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:08 AM