Share News

కేసీఆర్‌ ఇలాకాలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:49 AM

మాజీ సీఎం కేసీఆర్‌ నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎ్‌సకు బిగ్‌ షాక్‌ తగిలింది. నియోజకవర్గంలోని పలువురు నాయకులు బీఆర్‌ఎ్‌సను వీడి సీఎం

కేసీఆర్‌ ఇలాకాలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌

కాంగ్రె్‌సలో చేరిన డీసీసీబీ చైర్మన్‌

కొండపాక, ఏప్రిల్‌ 23: మాజీ సీఎం కేసీఆర్‌ నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎ్‌సకు బిగ్‌ షాక్‌ తగిలింది. నియోజకవర్గంలోని పలువురు నాయకులు బీఆర్‌ఎ్‌సను వీడి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రె్‌సలో చేరారు. వారిలో డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఆయన భార్య సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షురాలు చిట్టి మాధురి, సిద్దిపేట జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు దుద్దెడ మాజీ సర్పంచ్‌ ఆరేపల్లి మహదేవ్‌గౌడ్‌లతోపాటు పలువురు మాజీ సర్పంచులు కాంగ్రె స్‌ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్‌, హరీశ్‌లకు సన్నిహితంగా ఉన్న దేవేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ వీడడం నియోజకవర్గంలో పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు.

Updated Date - Apr 24 , 2024 | 04:50 AM