Share News

పరిసరాల అపరిశుభ్రతపై ఆగ్రహం

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:38 PM

కల్వ కుర్తి పట్టణంలోని మోడల్‌ డిగ్రీ కళాశాలను, కళా శాల బాలికల, బాలుర వసతి గృహాలను కల్వకు ర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పరిసరాల అపరిశుభ్రతపై ఆగ్రహం
విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- మోడల్‌ డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కశిరెడ్డి

కల్వకుర్తి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : కల్వ కుర్తి పట్టణంలోని మోడల్‌ డిగ్రీ కళాశాలను, కళా శాల బాలికల, బాలుర వసతి గృహాలను కల్వకు ర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం కళాశాలలోని అన్ని డిపార్ట్‌మెంట్లలో తిరిగి రికార్డులను పరిశీలించా రు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవడం, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ సక్ర మంగా లేకపోవడం పట్ల ఆగ్ర హం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులతో మాట్లాడారు. కళా శాల బాలికల, బాలుర వసతి గృహాలను తనిఖీ పరిసరాల నిర్వహణ పట్ల అసహనం వ్యక్తం చేశారు. వసతి గృహాల పరిధిలో నిఘా పెట్టాలని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి పోలీసులను ఆదేశించారు. అనంతరం డిగ్రీ కళాశాల అధ్యాపకులతో సమావే శమయ్యారు. కళాశాలలో నెల కొన్న సమస్యలను కావాల్సిన వసతులపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ఎమ్మెల్యే వెంట కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు బృంగి ఆనంద్‌ కుమార్‌, నాయకులు షానవాజ్‌ఖాన్‌, రమాకాంత్‌ రెడ్డి, నాయకులు ఉన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:39 PM