Share News

సందీప్‌రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:32 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగడాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ నిలదీస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) అన్నారు. గూడూరు గ్రామ పంచాయతీ

సందీప్‌రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలి

మంత్రి కోమటిరెడ్డిని నిలదీస్తాం: కేటీఆర్‌

యాదాద్రి జడ్పీ చైర్మన్‌కు ఫోన్‌

ఇది నియంతృత్వ పాలన: హరీశ్‌

భువనగిరి/హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగడాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ నిలదీస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) అన్నారు. గూడూరు గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ వేదికపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో నెలకొన్న వివాదంపై జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డికి కేటీఆర్‌ ఫోన్‌ చేసి ఆరా తీశారు. మంత్రి వ్యవహరించిన తీరును సందీ్‌పరెడ్డి కేటీఆర్‌కు వివరించారు. ఈ మేరకు కేటీఆర్‌ స్పందిస్తూ సందీ్‌పరెడ్డికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని, మంత్రి కోమటిరెడ్డి ఆగడాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ నిలదీస్తామన్నారు. మంత్రి తన అహంకార వైఖరిని, నోటి దురుసును మార్చుకుని జడ్పీచైర్మన్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. భువనగిరి జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డిపై దుర్భాషలాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్షణం క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ ్ట్రవర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా కోమటిరెడ్డి అందరిపైనా నోరు పారేసుకుంటున్నారని ఆయనపై ఆరోపించారు. జడ్పీ చైర్మన్‌ సందీప్‌ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్‌.. పార్టీ ఆయనకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కిందిస్థాయి కార్యకర్తనుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఎవరికి ఇబ్బంది ఎదురైనా పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ప్రజాపాలన అంటు న్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం లేదని, నియంతృత్వం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అరాచకాలను అడ్డుకొని తీరతామని కేటీఆర్‌ స్పష్టం చేశా రు. కాంగ్రెస్‌ ప్రజా పాలనలో సాటి ప్రజా ప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరి గర్హనీయమని, సందీ్‌పరెడ్డిపై కాంగ్రెస్‌ నేతల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మొన్న రైతుబంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అన్న కోమటిరెడ్డి.. ఇప్పుడు అధికారిక కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ను దుర్భాషలాడటం కాంగ్రెస్‌ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్య వాదులంతా కోమటిరెడ్డి పోకడలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎ్‌స నేత రావుల శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డిని పోలీసులతో నెట్టి వేయించడంపై ఆయన స్పందించారు.

ఫాంహౌస్‌ ముట్టుకుంటే చీల్చి చెండాడతాం

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై దాడులు చేస్తామంటూ కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ను ముట్టుకుంటే.. చూస్తూ ఊరుకోమని, చీల్చి చెండాడతామని, ముక్కలు ముక్కలు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Jan 30 , 2024 | 10:18 AM