Share News

నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అఘాయిత్యం

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:54 AM

మానవత్వం మంటకలిసేలా అభం శుభం తెలియని ఓ నాలుగేళ్ల చిన్నారిపై 66 ఏళ్ల వృద్ధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని

నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అఘాయిత్యం

దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగింత

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ఘటన

షాద్‌నగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 5: మానవత్వం మంటకలిసేలా అభం శుభం తెలియని ఓ నాలుగేళ్ల చిన్నారిపై 66 ఏళ్ల వృద్ధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉంది. ఆదివారం ఉదయం తోటిపిల్లలతో ఆడుకుంటున్న ఆ చిన్నారిని వారి పక్క ఇంట్లో నివాసముంటున్న విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి పెంటయ్య మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి బాలిక ఏడవటం మొదలుపెట్టింది. ఆ సమయంలో రోడ్డుపై ఆడుకుంటున్న మరో బాలిక పెంటయ్య ఇంట్లోకి వెళి ఆ చిన్నారిని బయటకు తీసుకువచ్చింది. రాత్రి తల్లిదండ్రులు నిద్రకు ఉపక్రమించాక.. చిన్నారి మాత్రం నిద్రపోకుండా ఏడుస్తూనే ఉంది. గమనించిన తల్లి ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించగా.. మర్మావయవాల వద్ద నొప్పి వస్తుందని చెప్పింది. చిన్నారిని ఆరా తీయడంతో జరిగిన దారుణం బయటపడింది. దీంతో సోమవారం తెల్లవారుజామున చిన్నారి కుటుంబసభ్యులు పెంటయ్య ఇంటికి వెళ్లి, అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారు పెంటయ్యను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 03:54 AM