Share News

రాజ్‌భవన్‌కు చేరిన క్షమాభిక్ష ఫైల్‌

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:58 AM

రాష్ట్రంలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు సంబంధించిన ఫైల్‌ రాజ్‌భవన్‌కు చేరింది. గాంధీ జయంతి, స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, ప్రభుత్వాలు మారినప్పుడు, ఇతర

రాజ్‌భవన్‌కు చేరిన క్షమాభిక్ష ఫైల్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు సంబంధించిన ఫైల్‌ రాజ్‌భవన్‌కు చేరింది. గాంధీ జయంతి, స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, ప్రభుత్వాలు మారినప్పుడు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ జనవరి 26న ఖైదీల విడుదలకు చర్యలు చేపట్టింది. అనివార్య కారణాల వల్ల ఆ ప్రక్రియ ఆలస్యమైంది. ఆదివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు.. ఖైదీల విడుదల ఫైల్‌ను ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పంపింది. గవర్నర్‌ పరిశీలన అనంతరం ప్రభుత్వ జీవో మేరకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లల్లో ఉన్న సుమారు 231 మంది ఖైదీలు క్షమాభిక్ష కింద విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండు దఫాల్లో సుమారు 400 మంది ఖైదీల్ని క్షమాభిక్షపై విడుదల చేసింది.

Updated Date - Feb 06 , 2024 | 04:58 AM