ఇసుక రీచగా అమ్మనబోలు మూసీవాగు?
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:59 AM
నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు-పొడిచే డు గ్రామాల మధ్యలో ఉన్న మూసీ వాగును ఇ సుక రీచగా గుర్తించే ప్రయత్నాలు మొదలయ్యా యి.
ఇసుక రీచగా అమ్మనబోలు మూసీవాగు?
వాగును రీచగా గుర్తించాలని కలెక్టర్‌కు విన్నపం
నేడు సంయుక్తంగా అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
రీచతో గ్రామ పంచాయతీకి సమకూరనున్న ఆదాయం
నార్కట్‌పల్లి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు-పొడిచే డు గ్రామాల మధ్యలో ఉన్న మూసీ వాగును ఇ సుక రీచగా గుర్తించే ప్రయత్నాలు మొదలయ్యా యి. అమ్మనబోలు శివారులో ఉన్న మూసీ వాగు ను ఇసుక రీచగా గుర్తించాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిఽధులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయి తే అదే గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధు లు కలెక్టర్‌కు ఇటీవల వినతిపత్రం అందజేశారు. మూసీ వాగును ఇసుక రీచగా గుర్తించాలని కోరు తూ చేసిన విజ్ఞాపనపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 23వ తేదీన మూసీ వాగు ను సంబంధిత అధికారుల బృందం సంయుక్తంగా సందర్శించి నివేదిక తయారు చేయాల్సి ఉంది. కానీ కొందరు అధికారులకు ఇతర కార్యాల య పనుల నిమిత్తం ఈ నెల 30 తేదీకి వాయిదా వేశారు.
రీచగా గుర్తించాలంటే ...
ఇసుక రీచగా గుర్తించాలంటే దానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రతిపాదిత వాగు ప్రదేశాన్ని భూగర్భ జలనవనులు, ఇరిగేషన, మైనింగ్, గ్రామీణ నీటి సరఫరా, రెవెన్యూ విభాగం అధికారులు ముందుగా జాయింట్ సర్వే చేయాల్సి ఉంటుంది. వాగులో ఇసుక లభ్యతను నేరుగా గుర్తించాలి. రీచగా గుర్తించే వాగులో 5 హెక్టార్ల లోపు మాత్రమే తవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు వాగులో సుమారు 8 మీటర్ల లోతు ఇసుక లభ్యత ఉంటే కేవలం 5 మీటర్ల వరకు మాత్రమే తవ్వాల్సి ఉంటుంది. వాగు భూతలం నుంచి ఎప్పటికీ కనీసం 3 మీటర్లకు తగ్గకుండా ఇసుక ఉండాలి. వాగులో వాటర్ ఫిల్టర్ బెడ్‌లు ఉండకూడదు. రీచగా గుర్తించిన తర్వాత ఇసుక రవాణాకు చెల్లించే రుసుములో కొంత మొత్తం సంబంధిత గ్రామ పంచాయతీకి జమ చేయనున్నందున సర్వే అధికారులు ఖచ్చితంగా అదే గ్రామ పంచాయతీ రెవెన్యూ శివారు పరిధికి హద్దులు సూచించాలి. పెద్ద నదులైతే పర్యావరణ అనుమతి తీసుకోవాల్సి ఉండగా రిజర్వాయర్లు అయితే పూడికతీత కింద రీచలుగా గుర్తించే వీలుంది. ఈ ప్రామాణికాలన్నింటినీ పరిశీలించి నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు సమర్పించనున్నారు. నివేదికను పరిశీలించి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష అనంతరం అధికారికంగా రీచగా గుర్తిస్తారు.
ఇసుక అక్రమ రవాణాకు చెక్
ఇసుక రీచగా గుర్తిస్తే సదరు వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణాకు దాదాపు చెక్ పడనుంది. ప్రస్తుతం అమ్మనబోలు మూసీ వాగు ప్రభుత్వ ఇసుక రీచ జాబితాలో లేకపోవడంతో ఇసుక మాఫియా ఇష్టానుసారంగా ఇసుకను దాచేసి, దోచేస్తుంది. రీచగా గుర్తించిన అనంతరం మైనింగ్ శాఖ సదరు వాగును ఆనలైనలో పెట్టనుంది. దీంతో సరసమైన ధరకే లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ అవసరాల కోసం లేదా ప్రభుత్వ నిర్మాణ అవసరాల కోసం రాయల్టీ చెల్లించి మన ఇసుక - మన వాహనం ద్వారా ఇసుకను అధికారికంగా రవాణా చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అనుమతి లేకుండా ఇసుకను తవ్వితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు.
జీపీకి సమకూరనున్న ఆదాయం
అమ్మనబోలు మూసీ వాగు ఇసుక రీచగా గుర్తిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు సంబంధిత గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరనుం ది. ఇసుక తరలింపు కోసం కట్టే రాయల్టీ నుంచి ట్రాక్టర్‌కు రూ.100ల చొప్పు న గ్రామ పంచాయతీ ట్రెజరరీ ఖాతాలో జమ కానుంది. మైనింగ్ అధికారుల లెక్కల ప్రకారం ఒక హెక్టార్‌లో సుమారు 75వేల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల ఇసుకను సేకరించుకోవచ్చు. ఒక ట్రాక్టర్‌లో సుమారు 3టన్నుల మేర ఇసుకను రవాణా చేసేందుకు సుమారు 25వేల ట్రిప్పులవుతుంది. దీంతో ట్రాక్టర్‌కు రూ.100 చొప్పున అమ్మనబోలు గ్రామ పంచాయతీకి సాలీ నా రూ.25 లక్షల మేర అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
ప్రజావాణిలో దరఖాస్తు చేశాం
అమ్మనబోలు మూసీ వాగును ఇసుక్ రీచగా గుర్తించాలని ప్రజావాణిలో గ్రామస్తులతో కలిసి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాం. ఇసుక రీచగా గుర్తిస్తే స్థానికులకు ఉపాధి, గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుంది. అంతేకాక స్థానిక నిర్మాణ అవసరాలకు ఇసుక అందుబాటులోకి వస్తుంది. అంతేకాక ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు రీచగా గుర్తించాలని కోరాం.
కొంపల్లి సైదులు, మాజీ ఎంపీటీసీ,
కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు
అమ్మనబోలు మూసీ వాగును ఇసుక రీచగా గుర్తించాలని కోరుతూ గ్రామస్థులు ప్రజావాణిలో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. గ్రామస్థుల వినతి మేరకు కలెక్టర్ ఆదేశాలతో ఉమ్మడి కార్యాచరణతో, తనిఖీలు చేపట్టాల్సి ఉంది. ఈ మేరకు ఈ నెల 30వ తేదీన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించి తదుపరి ఆదేశాల మేరకు రీచ గుర్తింపుపై నిర్ణయం తీసుకుంటాం.
వెంకటేశ్వర్‌రావు, ఏడీ, మైనింగ్‌శాఖ