Share News

Kumaram Bheem Asifabad- పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , Publish Date - May 19 , 2024 | 11:02 PM

మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1988 లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలు నెమరవేసుకున్నారు

Kumaram Bheem Asifabad-    పూర్వ విద్యార్థుల సమ్మేళనం
సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

వాంకిడి, మే 19: మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1988 లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలు నెమరవేసుకున్నారు. 36 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు తెలుసుకుని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం ఆనాడు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు లచ్చారెడ్డి, సాబయ్యను పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఆనాడు చదువుకున్న విద్యార్థుల సమాచారం సేకరించి అందరిని ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేలా కృషి చేసిన విద్యార్థులు నడిపల్లి వెంకటేశ్వర్‌రావు, అల్లోజు రవి, దర్గం రాకేష్‌, తుకారాంలను ఈ సందర్భంగా అభినందించారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కాగజ్‌నగర్‌, మే 19: కాగజ్‌నగర్‌ బాలభారతి పాఠశాలలో పదవ తరగతి చదివిన 1994-95 లో పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఒక్క చోట కలుసు కున్నారు. ఈ సందర్భంగా అప్పుడు తమకు పాఠాలు బోధించిన గురువులను సన్మానించారు. అనంతరం చిన్ననాటి మిత్రులతో కలిసి గత సృతులను గుర్తు చేసుకున్నారు. పలు సంస్కతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ ఖాజ వసీమోద్దీన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 11:02 PM